యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)ప్రస్తుతం దేవర(దేవర)సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.చాలా ఏరియాల్లో సరికొత్త రికార్డులని నెలకొల్పిన దేవర ఓవర్ ఆల్ గా ఇప్పటి వరకు ఐదు వందల కోట్ల రూపాయల గ్రాస్ ని వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఎన్టీఆర్ కూడా ఈ విషయంపై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఒక నోట్ నివేదిస్తున్నారు. కూడా రిలీజ్ చేసాడు.అందులో దేవర కి పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలను తెలియపరచడంతో పాటుగా అభిమానుల రుణం, ప్రేక్షకుల రుణం తీర్చుకోలేనిదని కూడా చెప్పుకొచ్చాడు.
ఇక ఎన్టీఆర్ తన కెరియర్ కి సంబంధించి మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇక పై వెంటనే సినిమాలు పూర్తి చేసి, త్వరగా విడుదల చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఆ ఉద్దేశ్యంతోనే హృతిక్ రోషన్(hrithik roshan)తో కలిసి బాలీవుడ్ లో చేస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 (war 2)లో నటిస్తున్న తారక్ నవంబర్ నుండి 2 కి డేట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.ఆల్రెడీ ఎన్టీఆర్ మీద ఇది వరకే కొంత ఉన్నట్లు కూడా చిత్రీకరించారు.ఇక ఆ షెడ్యూల్ పూర్తవ్వగానే ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా నవంబర్ లోనే ప్రశాంత్ నీల్(ప్రశాంత్ నీల్)మూవీ షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నాడని అంటున్నారు.
ఇటీవలే అధికారంగా ప్రారంభమయిన ఈ మూవీ,షూట్ కి ఎన్టీఆర్ వచ్చే కొన్ని రోజులు లేట్ అయినా కూడా ఎన్టీఆర్ లేని సీన్స్‌కి సంబంధించిన షూట్ ని చిత్రీకరించేందుకు ప్రశాంత్ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.ఈ రెండే కాకుండా దేవర పార్ట్ 2(దేవర పార్ట్ 2)కూడా వీలైంత త్వరగానే ప్రారంభించాలనే ప్లాన్ తోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ వార్తలతో ఎన్టీఆర్ అభిమానులతో ఫుల్ ఖుషితో ఉన్నారు.వాళ్ళు ఎప్పటినుంచో ఎన్టీఆర్ నుంచి సంవత్సరానికి ఒక సినిమా అయినా విడుదల కావాలని కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ వచ్చిన రెండున్నర ఏళ్ళకి దేవర పార్ట్ 1 రిలీజ్ అయ్యింది.