ఒక హీరో అభిమానులు, మరో హీరో అభిమానులతో గొడవ పడిన ఘటనలు చూస్తుంటాం. అయితే హీరోకి చెందిన అభిమానులు రెండు వర్గంగా విడిపోయి కొట్టుకున్న ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. అలాంటి అరుదైన ఘటన భీమవరంలో ప్రభాస్ అభిమానుల మధ్య జరిగింది.
పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ కి ఎంతో ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా భీమవరంలో ప్రభాస్ కి ఉండే క్రేజే వేరు. ఆయన సినిమా వచ్చినా, బర్త్ డే వచ్చినా సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. నేడు(అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టినరోజు కావడంతో నిన్నటి నుంచే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ నచ్చిన ప్రభాస్ అభిమానులు ఇద్దరు వర్గంగా విడిపోయి గొడవపడ్డారు.
భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్.. సాహో, వాసు వర్గీయులు విడిపోయి దారుణంగా కొట్టుకున్నారు. నిన్న రాత్రి ప్రభాస్ బర్త్ డే వేడుకలను సాహో వర్గం ప్లాన్ చేయగా.. ఫేక్ ఫ్యాన్స్ వాసు వర్గం కామెంట్స్ ప్రకటించింది. ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. నడిరోడ్డు మీదే ఇరు వర్గాలపై దాడి చేశారు. ఈ దాడిలో కొందరికి గాయాలయ్యాయి. అలాగే పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.