సితార ఎంటర్ టైన్ మెంట్స్(sitara entertainments)పై భీమ్లా నాయక్, జర్సీ, భీష్మ, సార్, టిల్లు స్క్వేర్, మ్యాడ్, బాబు బంగారం వంటి హిట్ చిత్రాలను నిర్మించిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ. రీసెంట్ గా దుల్కర్ సల్మాన్(dulquer salman)హీరోగా దివాలి కి రిలీజ్ అయిన లక్కీ భాస్కర్(lucky baskhar)తో మరోసారి హిట్ ని అందుకున్నాడు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించడం జరిగింది.
అందులో నాగ వంశీ(naga vamsi)మాట్లాడుతూ 2029 ఎన్నికలకి ముందు స్టార్ హీరోతో పొలిటికల్ మూవీ చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నానని చెప్పాడు.దీంతో ఇప్పుడు ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మీరు ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ అని యాంకర్ అడిగితే జనసేన పార్టీ అని చెప్పాడు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్(pawan kalyan)పిఠాపురం(pitapuram)అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసినపుడు పవన్ గెలుపు కోసం వంశీ ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించాడు.
నాగవంశీ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ తో మాస్ జాతర అనే మూవీతో పాటుగా,బాలకృష్ణ 109 వ భయంకర, విజయదేవరకొండ తో ఒక దృఢంగా చేస్తున్నాడు. ఈ మూడు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. మ్యాడ్ మూవీ సీక్వెల్ కూడా షూటింగ్ జరుపుకుంటుంది.