వెబ్ సిరీస్ : సిటడెల్ హనీ బన్నీ
నటినటులు : సమంత, వరుణ్ ధావన్, కేకే మీనన్, సికందర్ ఖేర్, షకీబ్ సలీమ్, సిమ్రన్
రచన: సీత. ఆర్ మేనన్, రాజ్ అండ్ డీకే
ఎడిటింగ్: సుమిత్ కొటియన్
సినిమాటోగ్రఫీ: జాన్
సంగీతం: సచిన్-జిగర్
నిర్మాతలు: సయ్యద్ జాయెద్ అలీ, అలెక్ కోనిక్
దర్శకత్వం: రాజ్ అండ్ డీకే
ఓటీటీ : ప్రైమ్ వీడియో
కథ:
2000 సంవత్సరంలో నైనితాల్ లోని ఓ ప్రాంతంలో హనీ(సమంత), తన కూతురు నాడియా ఉంటారు. ఇక రోజు పొద్దున్నే స్కూల్ లో తన కూతురిని డ్రాప్ చేస్తే హనీ.. ఓ రోజు తనని ఎవరో వెంబడిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక వారిని నడిపిస్తూనే కూతురిని ఒక సేఫ్ ప్లేస్ లో ఉంచుతుంది హనీ. ఆ తర్వాత కథ మళ్ళీ ఎనిమిది సంవత్సరాల వెనక్కి అంటే 1992 సంవత్సరానికి వెళ్తుంది. ముంబై లోని ఓ ప్రాంతంలో సినిమాలో అవకాశం కోసం హానీ ప్రయత్నం చేస్తుంది. అక్కడే తనకి స్టంట్ మాస్టర్ గా చేస్తే బన్నీ(వరుణ్ ధావన్) తో స్నేహం ఏర్పడుతుంది. మరోవైపు హనీ తన ఇంటి అద్దె కూడా కట్టుకోలేని స్థితిలో ఉంటుంది. అదే సమయంలో బన్నీ అలియాస్ రాహీ ఓ కొత్త జాబ్ గురించి హనీకి చెప్తాడు. తన బాస్ బాబా(కేకే మీనన్) దగ్గర హనీని జాయిన్ చేస్తాడు. ఆ తర్వాత హనీకి సూపర్ ట్రైనింగ్ ఇస్తాడు రాహీ. అలాంటి పరిస్థితుల్లోనే ‘ఆపరేషన్ తల్వార్’ అనే మిషన్ ను ‘సిటాడెల్’ తెరపైకి తెస్తుంది. బాబా ఆ సంస్థను శత్రువుగా భావిస్తూ ఉంటాడు. ఆ మిషన్ ను పూర్తి కాకుండా ఆపలనీ, ఆ మిషన్ కి సంబంధించిన ‘వెపన్స్ ప్రోగ్రామ్’ను తాను దక్కించుకోవాలని భావిస్తున్నాడు. అందుకోసం రాహి – హనీని రంగంలోకి దింపుతాడు. ‘వెపన్స్ ప్రోగ్రామ్’ ను డాక్టర్ రఘు (తలైవాసల్ విజయ్) నుంచి కాజేయడం కోసం అతనితో హనీ పరిచయం పెరుగుతుంది. డాక్టర్ రఘు తీసుకోవాలనుకుంటున్నారా బాక్స్ ఏంటి? అసలు హనీకి బన్నీకి మధ్య గొడవేంటి? బాబా ఎందుకు హనీ ఫ్యామిలీని చంపాలనుకుంటానేది మిగిలిన కథ.
విశ్లేషణ:
సిటడెల్ అనేది ఓ సీక్రెట్ ఏజెన్సీ. ఇందులో కొంతమంది సీక్రెట్ గా జరుగుతున్న కొన్ని మిషన్స్ ని అబ్జర్వ్ చేస్తూ వారికి కావల్సిన ఫర్మేషన్ ని తీసుకెళ్తారు. ఇది హాలివుడ్ సినిమాల్లో సాధారణంగా ఉంటుంది. రీసెంట్ గా కేకే మీనన్ నటించిన ‘ శేఖర్ హోమ్ ‘ ఎంత హిట్టో అందరికి తెలుస్తుంది. అయితే రాజ్ అండ్ డీకే నుండి సిరీస్ వస్తుందంటే అందరికి గుర్తుండిపోయేవి. అయితే ఈ సిటడెల్ హనీ బన్నీ వాటిని బీట్ చేసిందా అంటే లేదనే చెప్పాలి.
రాజ్ అండ్ డీకే అంటే గన్స్, స్పై, థ్రిల్లింగ్, యాక్షన్ సీక్వెన్స్ పక్కా ఉండాల్సిందే అన్నట్టుగా ఈ సిరీస్ ఉంటుంది. ఇందులో మొత్తంగా ఆరు ఎపిసోడ్ లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ నిడివి యాభై నిమిషాలు పైనే ఉంటుంది. దర్శకులు అటు 1992లో .. ఇటు 2000లలో జరిగిన కథను సమాంతరంగా చూపిస్తూ వెళుతుంటారు. ఇక్కడ మిస్ అయితే కథేమీ అర్థం కాదు. మొదటిది, నాల్గవ ఎపిసోడ్ ఎంగేజింగ్ గా సాగుతుంది.
స్క్రీన్ ప్లే బాగున్నప్పటికి.. కథ ప్రస్తుతానికి గతానికి వెళ్తుండడంతో ఆ టైం పిరియడ్ లో ఉన్నవాళ్ళని గుర్తుంచుకోవడం కత్తి మీద సామే. స్క్రీన్ పై వేసే ‘సీజీ’ మిస్సయితే కాస్త కన్ఫ్యూజన్ వస్తుంది. కథ అంతా బాగానే ఉంది .. కాకపోతే ‘ఆపరేషన్ తల్వార్’ విషయంలో ఇంకాస్త క్లారిటీ ఇస్తే బాగుండేదేమో అనిపిస్తుంది.
బాబా(కెకె మీనన్) పాత్రను ఇంకాస్త పవర్ఫుల్ గా మలిస్తే బెటర్ గా ఉండేదేమో అనిపిస్తుంది. ఇక ఓ మిషన్ కోసం చేసే పోరాటంలో ఓ తల్లి తన కూతురిని కాపాడుకుందా లేదా అనే కోణంలో దర్శకుడు కథని కొనసాగిస్తే బాగుండేదనిపించింది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ని సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు. ఫర్జీ, ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్‌లలో చూసినవే మళ్ళీ చూస్తున్నామనే భావన కలుగుతుంది.
ఆఫ్ ఫుల్ యాక్షన్ తో నింపేశారు మేకర్స్. ఇక మాటిమాటికి ‘ఎఫ్’ పదం వాడుతుంటారు. అలాగే సమంత లిప్ లాక్, ఓ ఇంటిమెట్ సీన్ కాస్త డిస్టబింగ్ గా ఉంటుంది. అవేం పర్వాలేదంటే ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు. సచిన్ జిగర్ సంగీతం నేపథ్యం పెద్దగా సెట్ కాలేదు. జాన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సుమిత్ కొటియన్ ఎడిటింగ్ ఒకే. ఒక్కో ఎపిసోడ్ ని ‘ముప్పై అయిదు నుండి నలబై నిమిషాల్లో చెప్తే బాగుండేది.
నటీనటుల పనితీరు:
బన్నీగా వరుణ్ ధావన్, హనీగా సమంత స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. వారి పాపగా నది ఆకట్టుకుంది. బాబాగా కేకే మీనన్ ఒదిగిపోయాడు. ఇక మిగిలిన వారు వారి పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.
ఫైనల్ గా: యాక్షన్ ప్రియులకు మాత్రమే నచ్చే ఈ సిరీస్ ని కామన్ ఆడియన్స్ ఒక్కసారి చూసేయొచ్చు.
రేటింగ్: 2/5
✍️. దాసరి మల్లేశ్