సినీ రంగంలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రోజా(రోజా)ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎంఎల్ఏగా, మంత్రిగా కూడా పనిచేసిన విషయం తెలిసిందే. కాకపోతే మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయాన్నిఅందుకొని ఇంటికే పరిమితమైంది.
రీసెంట్ గా ఆమె గురించి ప్రముఖ సినీ నటుడు, జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పీ(kirak rp)మాట్లాడుతు నేను రోజా మంత్రిగా ఉన్నపుడు అవినీతిని ప్రశ్నిస్తుంటే, కొంత మంది రోజా నాకు జబర్దస్త్ పరంగా చాలా హెల్త్ చేసిందని, నా వ్యాపారానికి కూడా ప్రమోటర్ గా వచ్చిందని, ఇది నాకు విశ్వాసం లేదని చెప్పారు. తప్పు ఎవరు చేసినా నా నైజం.గతంలో రోజా తన అన్నయ్య రామ్ ప్రసాద్ రెడ్డి తన డబ్బు కోసం వేధిస్తున్నాడని,ఒక వేళ ఇవ్వకపోతే తనపై అసత్య ఆరోపణలు చేస్తానని బెదిరిస్తున్నాడని, 22 ఏళ్ల సినీ కెరీర్ లో సంపాదించిందంతా తీసుకొని నడి రోడ్డుపై ఉంచాడని,చంపుతానని కూడా వార్నింగ్ లు ఇస్తున్నాడని 2013 అక్టోబర్ 6న రోజా రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది.
మరి చిన్నప్పట్నుంచి ఒకే చోట కలిసి పెరిగిన అన్నయ్య డబ్బులు లాక్కొని చంపుతానని బెదిరిస్తున్నాడని కేసు పెట్టింది.అలా కేసు పెట్టడంలో తప్పు కూడా లేదు. తప్పు ఎక్కడుంటే అక్కడ నిలదీయాలి. మరి నేనేదో జబర్దస్త్ లో కలిసి చేసాం.నా బిజినెస్ ఓపెనింగ్ కూడా వచ్చిందని ఆమె వాటిని ప్రశ్నించకుండా ఉండాలా అని చెప్పుకొచ్చింది.