మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(varun tej)హీరోగా నటించిన మూవీ మట్కా(matka)నవంబర్ 14న వరల్డ్ వైడ్ గా విడుదలైంది.వరుణ్ సరసన మీనాక్షి చౌదరి(meenakshi chowdary)జత కట్టగా సలోని,నోరా ఫతేహి,నవీన్ చంద్ర,రవిశంకర్,కోశోర్,అజయ్ ఘోష్,సత్యం రాజేష్, ముఖ్య పాత్రలు పోషించిన పలాస ఫేమ్ కరుణ కుమార్(karuna kumar) దర్శకత్వంలో విజయేందర్ రెడ్డి, రజని తాళ్లూరి నిర్మించారు.
ఇప్పుడు ఈ మూవీ పై ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ(గీతా కృష్ణ)మాట్లాడుతూ మట్కా లేదు గుట్కా లేదు. మట్కా మూవీ చాలా పెద్ద డిజాస్టర్.అసలు మూవీలో ఏం లేదని కొంత మంది నాకు మెసేజ్ కూడా చేసారు. వరుణ్ మట్కా కి సంబంధించిన ప్రమోషన్స్ లో మనం పైకి రావడానికి కారణమైన వాళ్లని మర్చిపోకూడదని మాట్లాడాడు.ఆ మాటలు ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ ని ఉద్దేశించే అన్నాడు.దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సినిమాని బాడ్ చేసారని చెప్పుకొచ్చాడు. కంగువా మూవీ కూడా అతి పెద్ద ప్లాప్ గా నిలిచిందని తెలిపాడు.