కోలీవుడ్ స్టార్ సూర్య (సూర్య) హీరోగా శివ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘కంగువా’ (కంగువ). స్టూడియో గ్రీన్, యు.వి. క్రియేషన్స్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ భారీ అంచనాలతో నవంబర్ 14న థియేటర్లలో అడుగుపెట్టింది. అయితే ఊహించని విధంగా మొదటి షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా మొదటి 30 నిమిషాలు మరియు సౌండ్ డిజైన్ బాలేవని కామెంట్స్ వినిపించాయి. ఈ తాజాగా సూర్య భార్య, ప్రముఖ నటి జ్యోతిక ‘కంగువా’ గురించి షాకింగ్ రివ్యూ ఇచ్చారు. (కంగువ గురించి జ్యోతిక)
సూర్య భార్యగా కాకుండా, ఒక సినిమా లవర్ గా ఇది రాస్తున్నానంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు జ్యోతిక. ‘కంగువా’ సినిమా అద్భుతంగా ఉందని, అలాగే సూర్య నటన గర్వపడేలా ఉందని అన్నారు. అయితే సినిమాలో 30 నిమిషాలు వర్కౌట్ కాలేదని, అలాగే సౌండ్ కూడా లౌడ్ గా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి సినిమాలోనూ ఇలాంటి లోపాలు ఉండటం సహజమేనని.. ఆ లోపాలను పక్కన పెట్టి చూస్తే, కంగువ బిగ్ స్క్రీన్ పై అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ని ఇచ్చే సినిమా అని జ్యోతిక రాసుకొచ్చారు. అలాగే సినిమాలను ఉన్న ఒకట్రెండు లోపాలను పట్టుకొని మొత్తం సినిమానే బాలేదని రివ్యూలు రాయడాన్ని ఆమె తప్పుబట్టారు.
సాధారణంగా తాము నటించిన సినిమాలు కానీ, తమ కుటుంబసభ్యులు నటించిన సినిమాలను కానీ.. ఎలా ఉన్నా అద్భుతమని పొగిడేస్తుంటారు. అలాంటిది జ్యోతిక తన భర్త నటించిన సినిమాలో లోపాలు ఉన్నాయని నిజాయితీగా చెప్పడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.