ప్రముఖ సినీనటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)మహారాష్ట్రలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ధర్మంలో భాగంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపును కోరుతూ పదహారు, పదిహేడు తారీకుల్లో షోలాపూర్, డెగ్లూర్, పూణే, బల్లార్ పూర్, లాతూర్ లో ప్రచారం నిర్వహించారు.
ఈ రోజు ఫలితాలు వెలువడుతుండగా పవన్ ప్రచారం అన్ని చోట్లా బీజేపీ అభ్యర్థులు మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు.ఒక్క చోట మాత్రమే బీజేపీ వెనుకంజలో ఉంది. దీంతో పవన్ హవా ఏ పాటిదో అర్ధమవుతుంది. ఇక ఈ ప్రచార సభల్లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(chandrababu naidu)పాల్గొనాల్సి ఉన్నా కూడా ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణంతో వెళ్లలేకపోయారు.