మన సినిమాల్లోని హీరోలు ఎంతో స్మార్ట్‌గా ఉండాలని అందరూ అనుకున్నారు. స్మార్ట్ అంటే తెలివిగా ఆలోచిస్తాడు, విలన్‌లకు పై ఎత్తులు వేసి అతన్ని ఎత్తుగా చేస్తాడు. అలాగే హీరోయిన్‌ని తన మాటలతో, చేతలతో ఫ్లాట్ అయిపోయేలా చేస్తాడు. అలా కాకుండా హీరోకి శారీరక లోపం ఉంటే, హీరోకి ఉండాల్సిన లక్షణాలు లేకపోతే ఆ సినిమా ప్రేక్షకులు ఆదరిస్తారా.. అంటే తప్పకుండా ఆదరిస్తారు అని ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి. అంతేకాదు, హీరోని డీ గ్లామర్‌గా చూపించినా కంటెంట్ పవర్‌ఫుల్‌గా ఉంటే తప్పకుండా చూస్తున్నారు. గతంలో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి, సూపర్‌హిట్ అయ్యాయి. ఇటీవలికాలంలో సుకుమార్ చేసిన రెండు సినిమాల్లో హీరోని డీ గ్లామరైజ్డ్‌గా చూపించడం, వారికి ఏదో ఒక శారీరక లోపాన్ని పెట్టడం జరిగింది. ఆ రెండు సినిమాలు రంగస్థలం, పుష్ప. రంగస్థలంలో చరణ్‌కి చెవుడు ఉన్నట్టు చూపించారు. పుష్పలో అల్లు అర్జున్ భుజంలో లోపం ఉన్నట్లు చూపించారు. ఈ రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు రాబోతున్న రామ్‌చరణ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’లో కూడా హీరో క్యారెక్టర్‌లో ఓ లోపాన్ని చూపించబోతున్నారని తెలుస్తోంది.
‘గేమ్ ఛేంజర్’లో రామ్‌చరణ్ రెండు క్యారెక్టర్లు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒక క్యారెక్టర్‌కి నత్తి ఉంటుందట. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్‌లో పెద్ద వయసుతో కనిపించే అప్పన్న క్యారెక్టర్‌కి ఈ లోపాన్ని పెట్టారని తెలుస్తోంది. అతనికి వున్న లోపం కథలో ఓ ట్విస్ట్‌కి కారణమవుతుందట. ఈ ఎపిసోడ్ సినిమాని ఓ రేంజ్‌కి తీసుకెళ్తుందని సమాచారం. శంకర్ సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో అందరికీ తెలుసు. వాటిని మించే రీతిలో ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ని తీశారని చెప్పారు. ఈ ఎపిసోడ్ క్లిక్ అయితే సినిమా ఒక రేంజ్ కి వెళ్లిపోవడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ రెండు క్యారెక్టర్లను చరణ్ ఎంతో అద్భుతంగా చేశాడని చెబుతున్నారు. ‘గేమ్ ఛేంజర్’కి సంబంధించి వినిపిస్తున్న ఈ హైలైట్స్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ అప్‌డేట్ వల్ల అంతకుముందు సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అంతేకాదు, దేశంలోనే మొదటిసారి ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌ను స్పీడప్ చేయడంలో యూనిట్ చాలా ఎలర్ట్‌గా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన రెండు పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే మూడో సింగిల్ రిలీజ్ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇది ఒక మెలోడీ సాంగ్ అని థమన్ ఆల్రెడీ హింట్ ఇచ్చారు. ప్రస్తుతం అందరి చూపూ ‘పుష్ప2’ పై ఉంది. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. పుష్పరాజ్ హడావిడి ముగిసిన తర్వాత ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్‌కు స్పీడ్ పెంచాలని చిత్ర యూనిట్ అనుకుంటోంది. ఒక్కసారిగా అంచనాలు భారీగా పెరగడంతో చరణ్ ఈ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టించాడు.