2002లో రవితేజ(రవి తేజ)హీరోగా కృష్ణ వంశీ(కృష్ణ వంశీ)దర్సకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ మూవీ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటుడు సుబ్బరాజు.ఆతర్వాత ఎన్నో చిత్రాలలో విలన్‌గా,ఫ్రెండ్‌గా,క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి అశేష ప్రేక్షాభిమానుల అభిమానాన్ని పొందారు.
రీసెంట్ గా సుబ్బరాజు(subbaraju)తన ఇనిస్టా అకౌంట్ లో వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లుగా తన శ్రీమతితో కలిసి ఒక బీచ్ లో దిగిన ఫోటోని షేర్ చేసాడు, అందులో ఇద్దరు పెళ్లి బట్టలతో సోషల్ మీడియా వేదికగా సుబ్బరాజుకి అభినందనలు తెలుపుతున్నారు.అయితే ఈ పెళ్లి ఎప్పుడు జరిగింది, వధువు ఎవరనే విషయాలు మాత్రం సుబ్బరాజు వెల్లడి చేయలేదు. కొన్ని రోజుల క్రితం సుబ్బరాజు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఇంతవరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదో అనే విషయాన్నీ చెప్పిన సుబ్బరాజు ఇప్పుడు హఠాత్తుగా పెళ్లి ఫొటోలతో కనపడటం టాక్ ఆఫ్ ది డే గా మారింది.
పలు తమిళ, మలయాళ, హిందీ చిత్రాలలో కూడా నటించిన సుబ్బరాజు ‘అమ్మ నాన్న తమిళ అమ్మాయి, ఆర్య, సాంబ, భద్ర, నేనున్నాను, పోకిరి, దేశముదురు, పౌర్ణమి, యోగి,అతిధి, పరుగు, బుజ్జిగాడు, నేనింతే, దూకుడు, బుజ్జిగాడు, పవర్, శ్రీమంతుడు, అఖండ, మిర్చి,గద్దల కొండ గణేష్, బాహుబలి పార్ట్ 2 ,వాల్తేరు వీరయ్య లాంటి చిత్రాలు సుబ్బరాజు కి మంచి గుర్తింపు వచ్చింది.