పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు.. టెక్నాలజీ పెరిగే కొద్దీ తలనొప్పులు ఎక్కువైపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు టెక్నాలజీ దెబ్బకి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఫేక్ వీడియోలు, ప్రైవేట్ వీడియోల లీక్ లతో సెలబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గతంలో పలువురి హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అవి నిజమని నమ్మినవారు ఎందరో ఉన్నారు. అలాగే కొందరు సినీ సెలబ్రిటీలవి ప్రైవేట్ వీడియోలు లీక్ అయ్యాయి. అవి నిజమో కాదో తెలిసేలోపే వైరల్ అయిపోయాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఒక హీరోయిన్ కి ఎదురైంది. (ప్రజ్ఞా నాగ్రా)
మోడలింగ్ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రగ్యా నగ్రా, సౌత్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. తమిళ్ లో రెండు, మలయాళంలో ఒక సినిమా చేసిన ప్రగ్యా.. తెలుగులో ‘లగ్గం’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇలా హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలో ప్రగ్యా నగ్రా కి ఊహించని షాక్ తగిలింది. ఒక ప్రైవేట్ వీడియో లీక్ అయింది. అందులో ఆమె నగ్నంగా తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్నట్టుగా విజువల్స్ కనిపిస్తున్నాయి. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలోని అమ్మాయి ప్రగ్యా లాగానే ఉందని, అది ఆమె వీడియో గురించి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం, అది ప్రగ్యా ఫేస్ తో చేసిన ఫేక్ వీడియో అని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఫేక్ లు, లీక్ లు.. హీరోయిన్లకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి.