పుష్ప 2(పుష్ప 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు,ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలు పాలవడానికి కారణమయ్యాడనే కారణంతో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.
ఇక ఈ కేసులో అల్లు అర్జున్(allu arjun)కి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ ని పోలీసులు చెంచల్ గూడ జైలుకి తరలించడం జరుగుతుంది. కాగా అల్లు అర్జున్ వేసిన బెయిల్ పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది.