పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పవన్ కళ్యాణ్ (పవర్ స్టార్ పవన్ కళ్యాణ్) ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యంగా ఒక వైపు రాజకీయాల్లో ఆడుతూనే,మరో పక్క తన అప్ కమింగ్ మూవీస్ హరిహరవీరమల్లు(hariharaveeramallu)ఓజి(og)షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. వీరమల్లు ని పవన్ ముందుగా రిలీజ్ చెయ్యాలని అనుకోవడమే.అందులో భాగంగానే మార్చి 28 న వీరమల్లు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.
అన్నమయ్య జిల్లా గాలివీడు ఏంపిడివో జవహర్ బాబుపై దాడి జరగడంతో ప్రస్తుతం జవహర్ బాబు కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు.దీంతో పవన్ కళ్యాణ్ కడపలోని రిమ్స్ హాస్పిటల్ కి వచ్చి జవహర్ బాబు ని పరామర్శించి దోషులని కఠినంగా శిక్షిస్తామని చెప్పడం జరిగింది. ఇక పవన్ వచ్చాడనే విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పవన్ మాట్లాడుతున్న సమయంలో ఓజి,ఓజి అని అరవడం మొదలుపెట్టారు.దీంతో పవన్ అభిమానులను ఉద్దేశించి ఏంటయ్యా,ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో తెలియక తన అసహనాన్ని వ్యక్తం చేసాడు.