సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)వన్ మాన్ షో ‘గురుంటూరు కారం'(guntur kaaram)ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే.త్రివిక్రమ్(trivikram)దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో మహేష్ సరసన శ్రీలీల(sreeleela)మీనాక్షి చౌదరి(మీనాక్షి చౌదరి)జత కట్టగా హాసిని అండ్ హారిక క్రియేషన్స్ పతాకంపై సూర్య దేవర చినబాబు(chinababu)నిర్మాతగా వ్యవహరించాడు.థమన్(తమన్)సంగీతాన్ని అందించడం జరిగింది.
రీసెంట్‌గా వరల్డ్ వైడ్‌గా వివిధ దేశాలకు చెందిన సినిమాల్లో టాప్ పోజిషన్‌లో నిలిచిన పాటల జాబితాను విడుదల చేసింది. అందులోని కుర్చీ మడతపెట్టి వీడియో సాంగ్ 526 మిలియన్ల వ్యూస్ ని అంటే 52 కోట్ల వ్యూస్ ని సంపాదించింది. ఇంతవరకు ఏ ఇండియన్ సినిమాలోని పాట ఈ సినిమాని అందుకోలేదు.ఇక ఈ రికార్డు సాధించడం పై చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని కూడా తెలియజేసింది.
కుర్చీ మడత పెట్టి సాంగ్ లో మహేష్, శ్రీలీల ఒక రేంజ్ లో డాన్స్ చేసిన ప్రముఖ నటి పూర్ణ కూడా ఆ సాంగ్ లో మెరిసి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీని అందించడం జరిగింది.