గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)నటించిన గేమ్ చేంజర్(గేమ్ ఛేంజర్)మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విజయవాడకి చెందిన రామ్ చరణ్ యువశక్తి అభిమానులు ఇండియాలోనే ఇంత వరకు ఏ హీరోకి లేని విధంగా 256 అడుగుల భారీ కట్ అవుట్ ని విజయవాడలో ఏర్పాటు చేసి ఈ రోజు హెలికాఫ్టర్ చేత కట్ అవుట్ పై పూల వర్షం కురిపించారు.ఈ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా విచ్చేశాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఈ న్యూస్ తో మెగా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ వచ్చింది. కాకపోతే ఎక్కడ నిర్వహించామనే విషయంలో మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. మూవీ అభిమానులకి, ప్రేక్షకులకి నచ్చుతుందని, సరికొత్త రికార్డులు సృష్టించడం పక్కా అని కూడా అయన చెప్పుకొచ్చాడు.
చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న ఈ మూవీలో చరణ్ సరసన కియారా అద్వానీ జోడి కట్టగా అంజలి, శ్రీకాంత్,ఎస్ జె సూర్య, సునీల్ పాత్రల్లో కనిపించారు. తమన్ సంగీత సారధ్యంలో ఇప్పటికే రిలీజైన నాలుగు పాటలు,ఒక రేంజ్ లో ఉన్నాయి. త్వరలోనే ఐదో పాట కూడా విడుదల కావాలి.