ఈ నగరానికి ఏమైంది,ఫలక్ నామాదాస్,హిట్,పాగల్,ఓరి దేవుడా,దాస్ క ధమ్కీ,గామి,గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విశ్వక్ సేన్.రీసెంట్ గా మెకానిక్ రాఖీ తో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఒక విభిన్నమైన సినిమాలో చేస్తున్నాడు.
రీసెంట్ గా ఈ మూవీ నుంచి ‘సోను మోడల్’ అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. నారాయణ్ రవి శంకర్,రేష్మ శ్యామ్ ఈ సాంగ్ ని అత్యద్భుతంగా ఆలపించగా విశ్వక్ సేన్ సరికొత్త గెటప్ తో రెడ్ కారులో దిగడం,చుట్టూ అందమైన లేడీ మోడల్స్ ఉండటం చాలా కొత్త గా ఉంది, సాంగ్ లోని పదాలు కూడా చాలా విభిన్నంగా ఉన్నాయి.ఇక ఈ సాంగ్ కి స్పెషల్ ఏంటంటే విశ్వక్ సేన్ నే స్వయంగా ఈ పాటని రాసాడు. ఆల్రెడీ ఫలక్ నామ దాస్ తో గా ప్రూవ్ చేసుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు సరికొత్త గా పాటల రచయితగా అవతార మెత్తడం విశేషం.ఇక ఈ లైలా మూవీ ని సాహు డైరెక్టర్ గారపాటి నిర్మిస్తుండగా రామ్ నారాయణ్ దర్శకత్వాన్ని చూపిస్తున్నారు.
విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా చేస్తుండగా లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల.