పవన్ కళ్యాణ్(pawan kalyan)కొడుకు అకిరానందన్(akiranandan)గురించి పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయ వ్యాఖ్యానాలు అవసరం లేదు.సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ తన నాన్న అభిమానులని తన ఫాలోవర్స్ ని అలరిస్తూ ఉంటాడు.పియానో వాయించడంలో మంచి టాలెంట్ ఉన్న అకిరా ఆ పియానో పవన్ కి సంబంధించిన వ్యక్తిత్వం గురించి కొన్ని సాంగ్స్ కూడా చేసాడు.
అకిరా ప్రస్తుతం పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి(కాశీ)లో అకీరా నందన్ పర్యటిస్తున్నాడు. గంగానదిపై ఒక పడవలో కూర్చుని అకిరా వెళుతున్నాడు.ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వీడియోలోని అకీరా లుక్స్ మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.పవన్ అప్ కమింగ్ మూవీస్ లో ఒకటైన ఓజిలో అకిరా చేస్తున్నాడనే టాక్ ఉంది.