ఏపీలో 700 కోట్లు విలువ చేసే ల్యాండ్ స్కామ్‌లో ఇరుక్కుంది బుల్లితెర నటి రీతూ చౌదరి. విజయవాడ, ఇబ్రహీంపట్నం కేంద్రంగా 700 కోట్లను ఓ ముఠా కొట్టేసిందనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐతే తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా సంతకాలు చేయించారంటూ రిటైర్డ్ సబ్ రిజిస్టర్ ధర్మ సింగ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తూ ఒక లేఖ రాశారు. ఏపీ మాజీ సీఎం జగన్ అనుచరులు, చీమకుర్తి శ్రీకాంత్ ఆయన భార్య రీతూ చౌదరి పేరు మీద ఆస్తులు ఉన్నాయి.
రీతూ అసలు పేరు వనం దివ్య.. చీమకుర్తి శ్రీకాంత్ కు రెండో భార్య అంటూ మీడియాకి చెప్తున్నారు. ఇప్పటివరకు జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూ వచ్చిన రీతూ అలియాస్ వనం దివ్య ఈ స్కామ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్టర్ సింగ్ లేఖతో… ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. దీంతో సినీ నటి రీతూ చౌదరి పేరు ఏపీ రాజకీయాల్లోనే కాదు… తెలంగాణ రాష్ట్రంలో కూడా మారుమోగుతోంది. ఐతే రీసెంట్ గా రీతూ “సుఖ ఫార్మ్ స్టే” పేరుతో టాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ శివాజీ రాజా కుమారుడు విజయ రాజాతో ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. ఇక ఇపుడు వస్తున్న ఈ న్యూస్ మీద రీతూ చౌదరి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.