నందమూరి బాలకృష్ణ (నందమూరి బాలకృష్ణ) హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి ఎంతో క్రేజ్ ఉంది. ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తోంది. రీసెంట్ ఎపిసోడ్ లో బాలయ్య అప్ కమింగ్ ఫిల్మ్ ‘డాకు మహారాజ్’ టీం సందడి చేసింది. ఈ ఎపిసోడ్ లో డైరెక్టర్ బాబీ, ప్రొడ్యూసర్ నాగవంశీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉన్నారు. అయితే ఈ ఎపిసోడ్ ఓ వివాదానికి కారణమైంది. ఈ నందమూరి అభిమానుల్లో కాస్త గందరగోళాన్ని క్రియేట్ వివాదం చేసింది. (NBKతో ఆపలేనిది)
అన్ స్టాపబుల్ షోలో పలువురు హీరోల ప్రదర్శన, వారి గురించి డైరెక్టర్ బాబీని అడిగాడు బాలకృష్ణ. అయితే బాబీ దర్శకత్వంలో నటించిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తప్ప మిగిలిన హీరోలందరి ఫోటోలు అక్కడ ప్రదర్శించారు. ఎన్టీఆర్, బాబీ కాంబినేషన్ లో ‘జై లవ కుశ’ వంటి విజయవంతమైన చిత్రం వచ్చింది. బాబీ కెరీర్ లో ‘జై లవ కుశ’ సినిమాకి ప్రత్యేక స్థానముంది. అలాంటిది అన్ స్టాపబుల్ షోలో ఈ సినిమా ప్రస్తావన కానీ, అందులో నటించిన ఎన్టీఆర్ ప్రస్తావన కానీ రాలేదు. దీంతో కావాలనే షోలో ఎన్టీఆర్ సినిమా ప్రస్తావన రాకుండా చేశారనే కామెంట్స్ వినిపించాయి. ఇంకా కొందరైతే.. షోలో ‘జై లవ కుశ’ ప్రస్తావన వస్తే, బాలకృష్ణ కావాలని తీసేయించాడని న్యూస్ స్ప్రెడ్ చేశారు. అయితే ఆ న్యూస్ లో నిజం లేదని ఇప్పటికే అన్ స్టాపబుల్ షోకి వర్క్ చేస్తున్న వారిలో కొందరు సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, షూటింగ్ గ్యాప్ లో స్వయంగా బాలయ్యే బాబీ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ ని తీసుకొచ్చారట. “మా వాడితో సినిమా చేశావు కదా.. అందులో యాక్టింగ్ అదరగొట్టాడు” అని బాలయ్య మాట్లాడినట్లు అన్ స్టాపబుల్ టీం మెంబర్స్ చెప్పారు. తాజాగా నిర్మాత నాగవంశీ సైతం అలాంటి వ్యాఖ్యలే చేశాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీకి ‘జైలవ కుశ’ వివాదానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. స్పందించిన నాగవంశీ.. అసలు షోలో ‘జై లవ కుశ’ సినిమా ప్రస్తావన రాలేదని, బాలకృష్ణ గారు ఎడిట్ చేసిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు షూట్ బ్రేక్ లో ఒక సినిమా ప్రస్తావన వస్తే.. ఆ క్యారెక్టర్ జూనియర్ చేస్తే బాగుంటుందని బాలకృష్ణ గారు అన్నారని నాగవంశీ చెప్పుకొచ్చాడు. నాగవంశీ ఇచ్చిన క్లారిటీతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం వస్తుంది అనడంలో సందేహం లేదు.