20 సంవత్సరాలుగా సక్సెస్‌ఫుల్ సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా తన ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న దిల్‌రాజుకి ఈ ఏడాది సంక్రాంతి ఎంతో ప్రాధాన్యాన్ని తెచ్చిపెట్టింది. సంక్రాంతి కానుకగా విడుదలైన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్న చిత్రాలకు నిర్మాత. డాకు మహారాజ్‌కు సంబంధించిన నైజాం పంపిణీదారుడు. ఇందులో గేమ్ ఛేంజర్ కమర్షియల్‌గా నిరాశపరిచినా సంక్రాంతికి వస్తున్నాం మాత్రం బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొడతానన్న కాన్ఫిడెన్స్ దిల్‌రాజులో మొదటి నుంచీ ఉంది. ఆ నమ్మకం సంక్రాంతికి వస్తున్న చిత్రం నిలబెట్టింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఫిగర్స్ ప్రకారం సంక్రాంతికి వస్తున్నాం ఈ పండగ విన్నర్‌లా ప్రారంభమైంది.
ఈ నాలుగు రోజుల కలెక్షన్‌ని చూసి సంక్రాంతికి వస్తున్న చిత్రం ప్రపంచవ్యాప్తంగా 131 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే డాకు మహారాజ్ చిత్రం వసూళ్ళను సంక్రాంతికి వస్తున్నాం క్రాస్ చేసినట్టు. ఇక గేమ్ ఛేంజర్ ఇప్పటికే 300 కోట్లు కలెక్ట్ చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. సంక్రాంతికి వస్తున్నాం కూడా 300 కోట్ల మార్క్‌ని టచ్ చేసేలా నిర్మించబడింది. గేమ్ ఛేంజర్ చిత్రం బడ్జెట్‌కి, కలెక్ట్ చేసిన ఫిగర్స్‌కి పొంతన లేకపోవడంతో దిల్‌రాజు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే సంక్రాంతికి వస్తున్నాం ఆ నష్టాన్ని భర్తీ చేసే దిశగా వెళుతోంది. మరో పక్క డాకు మహారాజ్ నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్‌రాజుకు ఆ సినిమా కూడా లాభాలు తెచ్చిపెట్టేలా ఉంది. రెండు సినిమాలకు నిర్మాతగా, ఒక సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన దిల్‌రాజు భారీ నష్టాల బారిన పడకుండా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.