ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన హీరో కిరణ్ అబ్బవరం(కిరన్ అబ్బవరం).అతి కాలంలోనే వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ తన అభిమానులను అలరిస్తున్నాడు.రీసెంట్ గా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ‘క'(కా)అనే చిత్రంలో నటించి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని కూడా అందుకున్నాడు. .
ఇక కిరణ్ అబ్బవరం గత ఏడాది ఆగస్టులో సహనటి రహస్య(రహస్య)ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు తమ కెరీర్‌లో మొదటి సినిమా ‘రాజావారురాణివారు’లో కలిసి నటించే సమయంలో ప్రేమలో పడటంతో పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.ఇప్పుడు కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్నాడు.ఈ సందర్భంగా తన భార్యతో పాటు కిరణ్ అబ్బవరం దిగిన ఫోటోలు వైరల్‌గా మారాయి.