తెలంగాణ మహిళా కమిషన్ కి వివాదస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. అలాగే హీరో నాగచైతన్యపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో నాగచైతన్య-శోభిత ఎక్కువ కాలం కలిసి ఉండరని, విడాకులు తీసుకుంటారని వేణు స్వామి జ్యోతిష్యం చెప్పాడు. (వేణు స్వామి)
జ్యోతిష్యం పేరుతో ప్రముఖ వ్యక్తిగత జీవితాల గురించి బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు, వేణు స్వామి వ్యాఖ్యలపై తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు తెలంగాణ ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఒప్పందం వేణు స్వామి కి ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులను సవాలు చేస్తూ వేణు స్వామి హైకోర్టును ఆశ్రయించగా, ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. (నాగ చైతన్య)
ఈ నేపథ్యంలో వేణు స్వామికి ఉమెన్ కమీషన్ మరోసారి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ఉమెన్ కమీషన్ కార్యాలయానికి హాజరై తన వ్యాఖ్యలను ఉపసరించుకున్నట్లు తెలిపిన వేణు స్వామి.. ఉమెన్ కమీషన్ ను క్షమాపణ కోరాడు. ఈ సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని ఉమెన్ కమీషన్ వేణు స్వామిని హెచ్చరించింది.