సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున టాలీవుడ్ కి నాలుగు పిల్లర్స్ గా చెప్పుకునేవారు. ఈ నలుగురు స్టార్స్ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో వండర్స్ క్రియేట్ చేశారు. ఈ తరం స్టార్స్ తోనూ పోటీపడుతూ సినిమాలు చేస్తున్నారు. అయితే బాక్సాఫీస్ లెక్కల పరంగా మిగిలిన ముగ్గురు సీనియర్ స్టార్స్ తో ప్రస్తుతం.. నాగార్జున ఎందుకనో వెనకబడిపోయాడనే చెప్పాలి. (నాగార్జున)
రాజకీయాల కోసం కొన్నేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన చిరంజీవి, ‘ఖైదీ నెం.150’తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. రీఎంట్రీ తర్వాత చిరంజీవి నటించిన ఆరు సినిమాలు విడుదల కాగా, అందులో నాలుగు సినిమాలు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. పైగా అందులో ‘సైరా నరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు రూ.200 కోట్ల మార్క్ ని కూడా అందుకున్నాయి. ఇలా ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తున్నారు చిరంజీవి. (చిరంజీవి)
ఇక బాలకృష్ణ విషయానికొస్తే.. సీనియర్ స్టార్స్ లో మరెవరికి సాధ్యంకాని విధంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన చివరి నాలుగు చిత్రాలు ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాయి. రీసెంట్ ఫిల్మ్ ‘డాకు మహారాజ్’ అయితే ఇప్పటికే రూ.160 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, రూ.200 కోట్ల మార్క్ దిశగా పయనిస్తోంది. (బాలకృష్ణ)
చిరంజీవి, బాలకృష్ణకు ధీటుగా వెంకటేష్ కూడా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ‘ఎఫ్-2’, ‘ఎఫ్-3’ సినిమాలతో రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకున్నారు. ఇక రీసెంట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’తో రూ.200 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమైంది. అంతేకాదు ఈ సినిమా కలెక్షన్ల జోరు చూస్తుంటే.. రీజినల్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచినా ఆశ్చర్యం లేదు. (వెంకటేష్)
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తో ప్రస్తుతం నాగార్జున బాక్సాఫీస్ రేస్ లో కాస్త వెనకబడిపోయాడు. నాగార్జున నటించిన ‘ఊపిరి’ సినిమా రూ.90 కోట్లకు పైగా గ్రాస్, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా రూ.80 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టేందుకు.. ఆయన రీసెంట్ సినిమాలు భారీ వసూళ్లు రాబట్టలేకపోతున్నాయి. బంగార్రాజు రూ.60 కోట్లకు పైగా గ్రాస్ రాబడితే, నా సామి రంగ రూ.40 కోట్ల లోపు గ్రాస్ కి పరిమితమైంది. పైగా నాగార్జున సోలో హీరోగా సినిమాలు కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం ‘కుబేర’, ‘కూలీ’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి నాగార్జున కూడా త్వరలోనే తాను హీరోగా నటించిన సినిమాతో రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరతాడేమో చూడాలి.