విక్టరీ వెంకటేష్(వెంకటేష్)హీరోగా హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి(అనిల్ రవిపూడి)దర్శకత్వంలో దిల్ రాజు(దిల్ రాజు)నిర్మించిన మూవీ’సంక్రాంతికి వస్తున్నాం’.(సంక్రాంతికి వస్తున్నం)సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలైన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా అనేక రికార్డులని నెలకొల్పుతుంది.ఇప్పటికే 200 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టిందంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సునామిని అర్ధం చేసుకోవచ్చు.
రీసెంట్ గా ఈ మూవీ గురించి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి)మాట్లాడుతుండగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిన్న చిత్రంగా విడుదలై భారీ చిత్రాలతో సమానంగా వసూళ్లు సాధించాయి. ‘సినిమా గురించి వ్యాఖ్యలు చెయ్యడం జరిగింది.
ఇంకా ఆయన మాట్లాడటం అర్ధవంతమైన కథతో ప్రేక్షకులు ముందుకు వచ్చే చిత్రాలకు ఎప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుంది,భారీ బడ్జెట్తో సినిమా నిర్మించామని అదనపు షోలు, టికెట్ రేట్లు ఎక్కువ పెంచుకోవడానికి అనుమతి కోసం వచ్చే బదులుగా కథా బలం ఉన్న చిత్రాలపై సినీ పరిశ్రమ దృష్టి సారించాలని చెప్పారు.అదే ‘లవ్ యు ఫాదర్'(లవ్ యు తండ్రి)సినిమా విజయవంతం కావాలని చిత్ర నటినటుల్ని,దర్శక నిర్మాతలని కూడా అభినందించడం జరిగింది.