ముద్ర,తెలంగాణ:- మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన బీఆర్‌ఎస్ శాసనమండలి సభ్యుడు నవీన్‌కుమార్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు శాసమండలి ఛైర్మన్ ఛాంబర్‌లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆయనతో ప్రమాణం చేశారు. కాగా, బీఆర్‌ఎస్ అభ్యర్థిగా నవీన్‌కుమార్ రెడ్డి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై 109 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్సీ నవీన్ మీడియాతో, తనను ఆశీర్వదించిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రజా ప్రతినిధులకు రుణ పడి ఉంటానని అన్నారు. తన గెలుపులో వారి కృషి మరవలేనిదని చెప్పారు. తన విజయం జూన్ రెండో తేదీనే లభించిందని గుర్తు చేస్తూ, తెలంగాణ అమరవీరులకు అంకితం ప్రకటించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్ రెడ్డి, సబితారెడ్డి, ఎమ్మెల్సీ దండే, ప్రస్తుతం కొనసాగుతున్నారు.