వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక మహిళా నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి స్పందించారు. ఓటమి అనంతరం మౌనం దాల్చిన ఆమె తొలిసారి శుక్రవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలన్నారు. కానీ, తాము మంచి చేసి ఓడిపోయామన్నారు. గౌరవంగా తలెత్తుకుని తిరుగుదామని, ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దామన్నారు. ఈ మేరకు ఎక్స్’ వేదికగా ఆమె పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఆమె రెండు ఫైర్ ఎమోజీలతోపాటు తన ఫొటోను కూడా జోడించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు దాటుతున్న తరుణంలో ఆమె ఈ మేరకు చేసిన పోస్ట్ ఆసక్తిని కలిగిస్తోంది. లేకపోతే, గత వైసీపీ ప్రభుత్వంలో రోజా ఫైర్ బ్రాండ్ నేతగా ఎదిగారు. మంత్రిగానూ పని చేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గాలి భాను చేతిలో ఓటమి పాలయ్యారు. 45,004 ఓట్ల తేడాతో ఆమె ఓటమి పాలుకావడంతో ఫలితాల అనంతరం ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. రోజా ఎక్కడా అంటూ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు వచ్చాయి. గతంలో రోజా చేసిన కాలానికి సంబంధించిన వీడియోలకు మీమ్స్‌తో జత చేస్తూ రోజాపై పలు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తొలిసారి ఓటమిపై స్పందించారు.