ప్రముఖ కన్నడ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఓ హత్య కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. తన అభిమాని అయినా రేణుకా స్వామిని హత్య చేసిన కేసులో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ నిందితులుగా ఉన్నారు. వీరి అరెస్ట్ జరిగి వారం గడుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి దర్శన్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. ఇదే సమయంలో పోలీసులు ఈ కేసులో అనేక కీలక ఆధారాలను సేకరించారు. ఇంకా మరిన్ని సమాచారం కోసం దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇక కేసులో భాగంగా దర్శనం పెట్టుకున్న పోలీసులు విగ్గులను తొలగించినట్లు తెలుస్తోంది. కొన్ని కీలక పరీక్షల కోసం మిగిలిన నిందితుల మాదిరిగానే దర్శన్ కి విగ్గు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కన్నడ సినీ నటుడు దర్శన కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన అభిమానిని చిత్ర హింసలకు గురిచేసి.. చంపించినట్లు దర్శన్ పై ఆరోపణలు వచ్చాయి. తన ప్రియురాలు పవిత్ర గౌడతో కలసి రేణుకా స్వామిని హత్య చేసినట్లు దర్శనంపై ఫిర్యాదులు వచ్చాయి. ఇక ఈ హత్య కేసు కన్నడ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు రీల్ హీరోగా ఉన్న దర్శన్ ఈ కేసుతో రియల్ విలన్ గా కనిపించాడు. ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పటికే క్యాబ్ డ్రైవర్ తో సహా 16 మందిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అదనంగా వారి నుంచి కీలక సమాచారం సేకరిస్తున్నారు. నిందితుల విచారణ వివిధ రకాలుగా కొనసాగుతోందని, నిందితులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశామని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి నిందితులు అందరినీ తీసుకెళ్లి ఆరోగ్య పరీక్షలు చేశారు. ఈ నేపథ్యంలోనే దర్శనం తలపై పెట్టుకున్న విగ్గును పోలీసులు తొలగించినట్లు సమాచారం. గత వారం రోజులుగా పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరచాల్సి ఉంది.
ఈ నేపథ్యంలేన ఏ-1 పవిత్ర గౌడ, ఏ2 దర్శన్ తో సహా అందరికి తల వెంట్రుకల శాంపిల్ ను సేకరిస్తున్నారు. ఈక్రమంలోనే దర్శన్ కి కూడా ఆయన ధరించిన విగ్ ను పోలీసులు తొలగించినట్లు సమాచారం. హీరో దర్శన్ రక్తం, వెంట్రుకల నమూనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఈ కేసుకు సంబంధించి నిందితులకు డీఎన్ఏలను ప్రారంభించారు. రేణుకాస్వామి డెడ్ బాడీ లభ్యమైన రోజు నుంచే కేసును సీరియస్‌గా తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక డీఎన్ఏ స్టేషన్లకో సమాచారం బయటకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.