తమ అభిమాన తారల చిన్ననాటి ఫోటోలు, ముచ్చట్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులు ఓ కొత్త ట్రెండ్ నే సెట్ చేశారు. ఈ మేరకు ఇప్పటివరకు ఎంతో మంది స్టార్ సెలెబ్రిటీల చిన్న నాటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొదట్లో ఎక్కువగా హీరోయిన్స్ చిన్న నాటి ఫొటోస్ బాగా వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు వారి ఫొటోస్ తో పాటు.. హీరోల చిన్ననాటి ఫొటోస్ కూడా ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి. మరి ఈ తాజాగా మరొక హీరో నేనెవరో చెప్పుకోండి అంటూ.. చైల్డ్ హడ్ పిక్స్ ట్రెండ్ లో కి వచ్చింది. మరి ఈ హీరో ఎవరో ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూసేద్దాం.
ఇక్కడ ఫొటోలో.. బాలకృష్ణుడు వేషంలో కనిపిస్తున్న బుడ్డోడు.. ఇప్పుడు సౌత్ లోనే ఓ స్టార్ హీరో. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించిన ఈ హీరోలకు.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా ఈ హీరో ఏజ్ పెరుగుతున్నా కూడా ఇంకా కుర్రాడిలానే కనిపిస్తూ ఉంటాడు. అతని సినిమాల కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. 48 ఏళ్ళ వయస్సు వచ్చినా కూడా.. ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ.. ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్న యంగ్ హీరోలకు గట్టి పోటీనే ఇస్తున్నాడు ఈ హీరో. అయితే బేసిక్ గా ఈ హీరో తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు. అయినా సరే తెలుగులో కూడా.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇంతకీ ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా… ఇక్కడ ఫొటోలో బాలకృష్ణుడి గెట్ అప్ లో కనిపిస్తున్న చిన్నోడు మరెవరో కాదు. హీరో విజయ్ దళపతి. జూన్ 22న విజయ్ పుట్టిన రోజు సందర్బంగా విజయ్ చిన్నప్పటి ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులు సందడి చేస్తున్నారు.
ఇక విజయ్ విషయానికొస్తే.. అతను చిన్న వయసులోనూ సినిమాల్లోకి వచ్చినా కూడా.. తనకంటూ ప్రత్యేకమైన స్టార్ డం రానందుకు చాలా ఏళ్ళు పట్టింది. 1996లో వచ్చిన పూవే ఉనకాకే సినిమా… విజయ్ కెరీర్లో బెస్ట్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఇక తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోలలో విజయ్ కూడా ఒకరు. ఇక విజయ్ రీసెంట్ గా నటించిన సినిమా వారసుడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. విజయ్ తన రెమ్యునిరేషన్ ను ఇంకాస్త పెంచినట్లు టాక్. ఇక ప్రస్తుతం విజయ్ నటిస్తున్న సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం. మరి ఈ సినిమా విజయ్ కెరీర్ లో ఎలాంటి సక్సెస్ ను తెచ్చిపెడుతుందో చూడాలి. మరి విజయ్ చిన్ననాటి ఫొటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.