బొమ్మకు క్రియేషన్స్ బ్యానర్‌పై బొమ్మకు హిమమాల సమర్పణలో డాక్టర్ బొమ్మకు మురళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఇండియా ఫైల్స్’. మన దేశంలో కల్చర్ డిఏన్ఏ మీద తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే. ప్రముఖ రాజకీయ నాయకుడు అద్దంకి దయాకర్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా, ఇంద్రజ, సుమన్, శుభలేక సుధాకర్, సితార, మక్రంద్ దేశ్ పాండే, రవి ప్రకాష్, హిమజ, జీవన్ కుమార్, సహస్ర వంటి ఇతర పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు విజేత యం.యం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. కాగా ఈ సినిమా ఆడియో వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణరాష్ట్ర సినిమాటోగ్రఫి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా నటి.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ – మా అద్దంకి దయాకర్ వచ్చి 10వ తేదీ నువ్వు ప్రసాద్ ల్యాబ్‌కి రావాలి అని చెప్పగానే ఒకే అని చెప్పా.. కీరవాణి సార్ గారు కూడా వస్తున్నారు అని చెప్పగానే ఇంకా సంతోషించాం అని అన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ అన్న కుమార్తె వెన్నలగారితో తన ఆప్యాయతను పంచుకొని గద్దర్‌గారి పోరాట పటిమ గురించి కొనియాడారు. ఇండియా ఫైల్స్ లాంటి గొప్ప సినిమా రిలీజ్‌కి ఎటువంటి సహాయం కావాలి అని అడిగిన నేను ముందు ఉండి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు
సంగీత దర్శకుడు యం యం కీరవాణి గారు మాట్లాడుతూ బొమ్మకు క్రియేషన్స్ వారి స్టూడియో విశేషాల గురించి చర్చించారు. బొమ్మకు క్రియేషన్స్‌తో వారికి గల అనుబంధాన్ని గూర్చి మాట్లాడారు. తిరిగి చూడు పాట యొక్క గొప్పదనాన్ని, గద్దర్ గారితో తన పరిచయం మరియు సినిమాలో తనకి కలిగిన సరదా అనుభవాల గురించి మాట్లాడుతూ.. గద్దర్ గారు పాడి ఆడి నటించిన పాటకి తాను మ్యూజిక్ అందించడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా తన సంతోషాన్ని వెలిబుచ్చారు.
చిత్ర కథానాయకుడు డాక్టర్ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. నేను ఈ సినిమాకు హీరో చేసే అవకాశం కల్పించిన బొమ్మకు మురళి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు. ఈ సినిమాకు ముఖ్య అతిధిగా వచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి చాలా థాంక్స్’ అని అన్నారు. ఈ సినిమాలో ఉన్న పాటలు కోమటిరెడ్డి గారికి బాగా నచ్చాయి. నేను కోమటిరెడ్డి అన్న గురించి ఒక్క తప్పుడు మాట మాట్లాడిన రోజు మా గద్దర్ అన్న వెంటనే నన్ను తీసుకోని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్న ఇంటికి తీసుకెళ్లి నీ పెద్దన్న లాంటోడు అని చెప్పిన గద్దర్ అన్నను గుర్తుచేసుకున్నారు. మన ఇరు రాష్ట్రాల సినిమా ఇండస్ట్రీ ని ఇంకో మెట్టు ఎక్కించాలి అనే తాపత్రయంతో ఉన్నారు మన కోమటిరెడ్డి అన్న అని. యాక్టింగ్ అంటే ఏంటో తెలియని నన్ను 40 రోజులు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి, ఇంత మంచి కంటెంట్‌లో ఉన్న సినిమాలో నటించే అవకాశం కల్పించారు.
హీరో సుమన్ మాట్లాడుతూ.. బొమ్మకు మురళి గారు సినిమా కోసమే బ్రతుకుతున్నారు. ఈ సినిమాలో తనకు మురళి గారు చాలా డిఫరెంట్ రోల్ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పారు. సినిమా పెద్ద ఘనవిజయం సాధిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేసారు.
గద్దర్ కూతురు వెన్నల మాట్లాడుతూ, ఇండియా ఫైల్స్ అనేది సినిమా కాదు, ఇది మన జీవితం అని కొనియాడారు. గద్దర్ గారు మన మధ్య లేకున్నా ఆయన మనలో నింపిన స్ఫూర్తి, పటిమ మనలో ఎప్పటికి పోరాటం అని అన్నారు.
ఈ సినిమా దర్శకులు డాక్టర్ బొమ్మకు మురళి గారు మాట్లాడుతూ నేను మీ అందరి కోసం తెరకెక్కించిన ఈ చిత్రానికి సంగీతం అందించిన కీరవాణి గారి గురించి ముందుగా మాట్లాడాలి. ఆయన మా సినిమాకు బాహుబలి సినిమా స్థాయి మ్యూజిక్ అందించారు. ప్రపంచంలో ప్రతి మూలకు వెళ్లగలిగే శక్తి ఒక్క సినిమాకు మాత్రమే ఉంటుంది. ఈ ఇండియా ఫైల్స్‌కి ముందుగా బీజం వేసింది గద్దర్ అన్ననే అని అన్నారు. గద్దర్ అన్న ఎప్పుడూ అంటుండేవారు సాంస్కృతిక విప్లవం అండ్ కల్చరల్ ఇన్వెన్షన్ మన దేశంలో ఇన్ని వేల దేవుళ్ళు, ఇన్ని లక్షల ఆచారాలు, ఇన్ని కోట్ల దేవుళ్లను సృష్టించారు. ఈ సినిమాలో గద్దర్ అన్న చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసారు, సినిమా కథ విషయంలో నాకు ఎంతో హెల్ప్ చేసారు. ఈ కథ కోసం ఒక రియల్ టైం రాజకీయ నాయకుడు కావాలి, లీడర్ మాత్రమే మన సమాజాన్ని ప్రభావితం చేయగలడు అని నమ్మి అద్దంకి దయాకర్ గారిని హీరోగా ఇండస్ట్రీ కి పరిచయం చేస్తున్నాను అన్నారు. కీరవాణి గారు మేము బ్రతికున్నంత కాలం గుర్తుపెట్టుకొని, ఈ పాటలు మేము చేసాం అనే గర్వంగా ఫీల్ అయ్యే పాటలు కీరవాణి సార్ ఇచ్చారు.. మీకు మా ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ఆయన పై తనకున్న అభిమానాన్ని డాక్టర్ చాటుకున్నారు. బొమ్మకు మురళి.