మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)తెలుగు సినిమారంగంలో గత నలభై ఏళ్లుగా తన హవాని కొనసాగిస్తూ వస్తున్నాడు. నేటికీ నెంబర్ వన్ హీరో చిరంజీవినే అని చెప్పుకోవచ్చు. ఇక ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్(pawan kalyan)రామ్(ram charan)అల్లు అర్జున్(alu arjun)వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ వంటి హీరోలు వచ్చారు. సినీ భాషలో ఆ అందర్నీమెగా ఫ్యామిలీ గా సంబోధిస్తారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక విషయం పై చర్చ జరుగుతుంది.
మెగా ఫ్యామిలీ తో పెట్టుకుంటే ఇక ఆ నటుడి సినీ ప్రయాణం ముగిసిపోయినట్టే అనే మాటలు చాలా రోజుల నుంచి సినీ పరిశ్రమతో పాటు సినీ అభిమానుల్లో వినిపిస్తున్నాయి.ఇందుకు ఉదాహరణగా పాతతరం నుంచే చాలా మంది ఆర్టిస్ట్ లు, నిర్మాతలు, దర్శకులు ఉన్నారు. ఇక ఇప్పుడు ఫ్రెష్ గా రోజా(రోజా)అలీ, పోసాని(పోసాని)యాంకర్ శ్యామల ఆ లిస్ట్ లో తమ కోసం పదిలపరుచుకోబోతున్నారనే వార్తలు వస్తు యి. అసలు విషయంలోకి వస్తే ఆ నలుగురు జగన్ కోసం వైసీపీ కి సపోర్ట్ గా ఉంటాడు. మొన్న జరిగిన ఎలక్షన్ లో వైసీపీ ఓడిపోవడంతో ఇక రాజకీయ నిరుద్యోగులు అయ్యారు.దీంతో మళ్ళీ సినిమాల్లో నటించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఏ నిర్మాత, దర్శకుడు, హీరో కానీ వాళ్లకి సినిమాల్లో అవకాశం ఇవ్వరనే మాటలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం వాళ్ళు ఎప్పటినుంచో మెగా ఫ్యామిలీ మీద విమర్శలు చేస్తున్నారు.వైసీపీ కి వంత పాడుతూ పవన్ తో పాటు ఆయన స్థాపించిన జనసేన పార్టీని చాలా దారుణంగా తిడుతూ వస్తున్నారు.
ఈ కారణంతోనే వాళ్ళకి సినిమాల్లో ఇక అవకాశాలు రావని తెలుస్తుంది. ఎందుకంటే పవన్ ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. పైగా డిప్యూటి సిఏం కూడా.. వీరితో ఇద్దరు అవకాశం ఇద్దామని అనుకున్నా కూడా రిస్క్ చేయడం ఎందుకని ఆలోచిస్తారని తెలుస్తుంది. ఒక రకంగా ఆ నలుగురి సినీ కెరీర్ క్లోజ్ అయ్యిందని కూడా అంటున్నారు. సోషల్ మీడియాలో ఇంకో న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇటీవల మెగా అభిమానుల ఆగ్రహానికి సిద్ధమైన అల్లు అర్జున్ తన సినిమాల్లో ఆ నలుగురికి అవకాశం ఇస్తాడేమో అని కామెంట్స్ చేస్తున్నారు.