తెలంగాణలో ఐఎస్ అధికారుల బదిలీ ప్రకియ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో 6 ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం (జూలై 20న) రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఎ శరత్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రవాణా, హౌసింగ్ శాఖ, సాధారణ పరిపాలన శాఖ (స్మార్ట్ గవర్నెన్స్) ప్రత్యేక కార్యదర్శిగా వికాస్ రాజ్ నియమితులయ్యారు.
జేఏడీ ప్రిన్సిపాల్ సెక్రటరీగా మహేశ్ దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొర్ర లక్ష్మి నియమితులయ్యారు. విపత్తు స్పెషల్ మేనేజ్‌మెంట్ సెక్రటరీగా హరీష్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
హనుమకొండ స్థానిక సంస్థల అదనపు కమిషనర్ రాధిక గుప్తా.. మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.