రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, హత్యలు, రాష్ట్రంలో అదుపుతప్పిన శాంతి భద్రతలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 24న ఢిల్లీ వేదికగా ధర్నాకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై ఇప్పటికే గవర్నర్ నజీర్ ను కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో గడిచిన 45 రోజులుగా జరిగిన దాడులు, హింసకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో కూడిన ఆధారాలను గవర్నర్కు అందించారు. మరోవైపు బుధవారం ఢిల్లీ వేదికగా ధర్నాకు ఆయన సిద్ధమవుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు నెలలు పూర్తికాకముందే జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా పూర్తి స్థాయిలో యాక్టివ్ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే దాడులకు గురైన బాధితులను పరామర్శించిన ఆయన.. రాష్ట్రంలో జరుగుతున్న హత్యకాండ రాజకీయాలపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్న ఉద్దేశంతో జగన్ ధర్నాకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న ఆఘాయిత్యాలను జాతీయ స్థాయిలో వివిధ పార్టీలకు తెలియజేయడంతోపాటు మీడియా ద్వారా దేశమంతటా సదస్సు చర్చ జరిగేలా ఉన్నది జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి. రాష్ట్రంలో ప్రధాన మీడియా కూటమికి అనుకూలంగా ఉండటం, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాలను ప్రజలకు తెలియజేసేలా చేయకపోవడం వంటి కారణాల వల్ల కూడా ఆయన ఢిల్లీని కేంద్రంగా ఎంచుకొని ధర్నాకు సిద్ధపడ్డారని చెబుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఢిల్లీలో నిర్వహించనున్న ఈ దీక్ష ద్వారా బలమైన ప్రతిపక్షంగా వైసిపి ఉందన్న పార్టీ స్థాయిలో తెలియజేయడంతోపాటు ఇకపై తాను ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేయబోతున్నట్లు ఈ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ దీక్షకు కలిసి వచ్చే పార్టీలను తీసుకురావాలని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఎంపీలకు సూచించారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ముఖ్యమైన పార్టీలతో సత్సంబంధాలను నెలకొల్పడం కీలకమైన నెల జగన్ మోహన్ రెడ్డి గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కోరికనే ఢిల్లీతో ప్రత్యేకంగా ఆయనతో సంబంధం ఉన్నందున ఇకపై నేరం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి దాదాపు 15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడు ఢిల్లీ స్థాయిలో రాజకీయాల పట్ల ఆసక్తి చూపించలేదు. కానీ ప్రస్తుతం మారిన సమీకరణలు, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో సత్సంబంధాలను ఆయన చూపిస్తున్నారు. ఢిల్లీ దీక్షకు ముఖ్యమైన పార్టీలకు చెందిన నాయకులు వచ్చేలా చేయడం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఢిల్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో పార్టీలతో పెద్దగా సత్సంబంధాలు లేవు. గడచిన కొన్నాళ్లుగా బీజేపీతోనే సన్నిహితంగా వైసిపి ఉంటూ వస్తుంది. రాష్ట్రంలో బిజెపి టిడిపితో దోస్తీ కట్టింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ బీజేపీని స్నేహపూర్వకంగానే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమికి చెందిన నాయకులు ఎవరు జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు నెరపడం లేదు. ఇది కూడా కొంత ఇబ్బందికర అంశంగా జగన్మోహన్ రెడ్డికి పరిణమిస్తోంది. ఢిల్లీ దీక్ష తర్వాత జగన్మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో తన రాజకీయ ఆలోచనను మార్చుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.