అర్జున్ రెడ్డి(arjun reddy)గీత గోవిందం తో మంచి క్రేజ్ సంపాదించిన హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda)డై హార్ట్ ఫ్యాన్స్ తో స్టార్ స్టేటస్ ని కూడా పొందాడు. ఇటీవల వచ్చిన ఫ్యామిలీ స్టార్(ఫ్యామిలీ స్టార్)పరాజయం పాలయిన కూడా ఆ ఛాయలేవీ దేవరకొండ సినీ జర్నీ డిస్ట్రబ్ చేయలేదు. దీన్ని బట్టి దేవరకొండ సినీ పవర్ ని అర్ధం చేసుకోవచ్చు. చారిటల్ ట్రస్ట్ ని కూడా స్థాపించి ఎంతో మందికి ఆర్ధికంగా అండగా ఉంటూ అభిమానులు గర్వపడేలా నడుచుకుంటున్నాడు. తాజాగా దేవరకొండ పర్సనల్ లైఫ్ ఇదే అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
దేవరకొండ, ఒక ఫారెన్ అమ్మాయి ఒక గదిలో ఉన్నారు. ఇద్దరు బెడ్ మీద చాలా క్లోజ్‌గా కనిపించారు. మొత్తం రెండు పిక్స్ లో ఒక దాంట్లో ఫారెన్ అమ్మాయి విజయ్ దేవరకొండకు ముద్దుగా, మరో ఫొటోలో విజయ్ దేవరకొండ ఆ అమ్మాయికి ముద్దులు పెడుతూ కనిపించాడు. అయితే అభిమానులు ఈ పిక్స్ విజయ్ దేవరకొండ మాత్రం పాత ఫొటోలని అంటున్నారు. గతంలో ఒక సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఫొటోలోనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.మరి దేవరకొండ ఏమైనా కనిపించాడేమో చూడాలి.
విజయ్ దేవరకొండ కెరీర్ విషయానికి వస్తే. మొన్ననే ప్రభాస్ కల్కి(కల్కి)లో అర్జునుడుగా కనిపించి అభిమానులను అలరించాడు. తన అప్ కమింగ్ మూవీగా నాచురల్ స్టార్ నాని(నాని)తో జర్సీ ని తెరకెక్కించి హిట్ ని కొట్టిన గౌతమ్ తిన్ననూరి మూవీ రాబోతుంది. ఈ మూవీ మీద దేవరకొండ అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. హ్యాట్రిక్ ప్లాప్ ల నుంచి దేవరకొండ బయటకి రావాలని కోరుకుంటున్నారు. ఇక దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ లో కూడా మూవీ చేస్తున్నాడు. తన పుట్టిన రోజు సంధర్భంగా వచ్చిన పోస్టర్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి.