దేశంలోనే అతి పెద్ద ప్రకృతి విపత్తుగా కేరళలోని వయనాడ్ ఘటన నిలిచిపోయింది. వరద ప్రభావం వల్ల కొండచరియలు విరిగిపడిన ఘటనలో జిల్లాలో మృతుల సంఖ్య 400కి చేరింది. ఇంకా వందల మంది ఆచూకీ లభ్యం కాలేదు. కొన్నివందల మంది గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. దేశ ప్రజల మనసులు కలచివేసిన ఈ ఘటనపై అనేక సినీ ప్రముఖులు కనిపిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది నటినటులు తమ విరాళాలను ప్రకటించడమే కాదు, స్వయంగా కేరళ సీఎం సహాయనిధి కోసం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ప్రకటించారు.
కోలీవుడ్ నుంచి విక్రమ్, సూర్య, జ్యోతిక, రష్మిక, నయనతార వంటి ప్రముఖులు విరాళాలు అందించారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి 1 కోటి రూపాయలు, అల్లు అర్జున్ 25 లక్షలు అందించారు, ప్రభాస్ అందరి కంటే ఎక్కువగా 2 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఒకప్పుడు టాప్ హీరోయిన్లుగా వెలుగొందిన నటిమణులు సుహాసిని, ఖుష్బూ, మీనా, శ్రీప్రియ, లిజి లక్ష్మి, కళ్యాణి ప్రియదర్శన్, శోభన అందరూ కలిసి 1 కోటి రూపాయల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రిగా కలిసి చెక్ రూపంలో ప్రకటించారు. దీనికి సంబంధించిన సీనియర్ హీరోయిన్ మీనా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘చెన్నయ్‌లోని కొందరు హీరోయిన్లు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల ప్రతినిధి కోటి రూపాయలు కలెక్ట్ చేసి వయనాడ్ బాధితుల కోసం ముఖ్యమంత్రికి అందజేశాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. వయనాడ్ ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం’ అని పోస్ట్ చేశారు.