మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (జూ ఎన్టీఆర్), డైరెక్టర్ కొరటాల శివ (కొరటాల శివ) కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీ ‘దేవర’ (దేవర). అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదలయ్యాయి. ఆ రెండు సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా సెకండ్ సింగిల్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది.
‘దేవర’ నుంచి ఫస్ట్ సింగిల్ గా ‘ఫియర్ సాంగ్’ (ఫియర్ సాంగ్), సెకండ్ సింగిల్ గా ‘చుట్టమల్లే సాంగ్’ (చుట్టమల్లే సాంగ్) విడుదలయ్యాయి. ఫియర్ సాంగ్ మాస్ ని ఒక ఊపు ఊపగా.. చుట్టమల్లె మెలోడీ సాంగ్ అన్ని వర్గాల వారిని అలరిస్తూ దూసుకుపోతోంది. యూట్యూబ్‌లో ఇప్పటికే ఈ సాంగ్ 125 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఈ సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్ ను విడుదల చేసి, తమ ఆనందాన్ని పంచుకున్నారు. యూట్యూబ్ లోనే కాదు సోషల్ మీడియాలోనూ రీల్స్ రూపంలో చుట్టమల్లె సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. (దేవర పాటలు)
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా దేవర సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టనుంది. విడుదల తేదీ దగ్గర పడుత ఇతర సాంగ్స్ విడుదలకి మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో థర్డ్ సింగిల్, మూడు వారంలో ఫోర్త్ సింగిల్ విడుదలయ్యే అవకాశం ఉంది.