ముంబై కి చెందిన సినీ నటి కాదంబరి ఆషా జెత్వాని(asha jethwani)ని గత వైసిపి ప్రభుత్వ హయాంలో, ఆంధ్రప్రదేశ్ కి చెందిన వైసిపి నాయకుడి కొడుకు ప్రేమ పేరుతో లొంగదీసుకుని చిత్ర హింసలకి గురి చేసిన విషయం అందరకీ తెలిసిందే.దీంతో ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం జెత్వాని ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకువచ్చింది ఆఫీసర్స్ మీద కేసులు కూడా నమోదు చేసింది.ఇంకా అంశాల మీద విచారణ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ విషయంపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల(షర్మిల)కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.
నేను జెత్వాని గురించి ఎంక్వయిరీ చేశాను.ఒక అకంప్లెక్షన్ ఉమెన్ అయిన జెత్వాని ఒక డాక్టర్. ఇంటర్నేషనల్ ఇనిస్ట్యూట్ కి రీసెర్చ్ పేపర్ కూడా రాసింది.యాక్టింగ్ ఫీల్డ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో హీరోయిన్ అవుదామని వచ్చింది. అలాంటి ఆవిడ నన్ను ఎక్స్‌ప్లాడ్ చేసారని కేసు పెట్టబోతే సమాజంలో ఆర్థికంగా చాలా పెద్ద స్థితిమంతుడైన ఒక వ్యక్తి జెత్వాని ని తొక్కాలని చూసాడు.కానీ అందరు ఒక ఆలోచన చెయ్యండి. కాదంబరి అంటే ఆవిడ నిజంగా డబ్బు కోసం డ్రామాలాడితే ఒక యాభై కోట్లో, వంద కోట్లో ఇచ్చి ఆమె నోరు మూయించేవాళ్లు. కానీ ఆవిడ ఎలాంటి ప్రెజర్ కి లొంగకుండా నాకు న్యాయం జరగాలని నిలబడితే చాలా గోరంగా తొక్కాలని చూసారు.
అందుకే పదిహేను, ఇరవై మంది ఆఫీసర్లు ముంబై వెళ్లి మరి జెత్వాని ని తీసుకొచ్చి చిత్రహింసలకి గురి చేసారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇప్పటి ప్రభుత్వం జెత్వాని కి న్యాయం జరిగేలా చూడాలి. అదే విధంగా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని చెప్పే జగన్ మోహన్ రెడ్డి తన హయంలో జరిగిన జెత్వాని అంశం పై వివరణ కూడా కోరింది. ఇక జెత్వాని తండ్రి నావి ఆఫీసర్, తల్లి రిజర్వు బ్యాంకులో అత్యున్నత పదవిలో చేసి రిటైర్ అయ్యింది. వీళ్ళని కూడా గత ప్రభుత్వం చిత్రహింసలకి గురి చేసింది.