యువసామ్రాట్ నాగార్జున(nagarjuna)అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో, సూపర్ స్టార్ రజనీ కాంత్ (rajini kanth)కూలీ(coolie)కూడా జాయిన్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్ట్ సరికొత్త ఇమేజ్ ని సొంతం చేసుకుంది. పైగా ఇప్పటి వరకు హీరోగా, విలన్స్ భరతం పట్టిన నాగ్ ఫస్ట్ టైం కూలీ లో విలన్ గా చేస్తున్నాడు. ఇందుకు గాను నాగ్ అందుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది డే గా నిలిచింది.
విలన్ గా కనిపిస్తున్నందుకు ఇరవై నాలుగుకోట్ల రెమ్యునరేషన్ ని నాగ్ అందుకున్నాడనే సమాచారం ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ప్రెజంట్ హీరోగా చేసే సినిమాల్లో కూడా నాగ్ అంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ని అందుకోవడం లేదు. అలాంటిది ఏకంగా ఇరవై నాలుగు కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నాడనే వార్తలపై టాలీవుడ్ మేధావులు సైతం ఆశ్చర్యపోతున్నారు. విలన్ రోల్ కోసం నాగ్ ఎక్కువ డేట్స్ కేటాయించాడని , అందుకే అంత అమౌంట్ డిమాండ్ చేసాడనే మరో టాక్ కూడా వినిపిస్తోంది. సౌత్ లో నాగ్ కి ఉన్న ఇమేజ్ తో పాటుగా, దర్శకుడు లోకేష్ కనగ రాజ్(lokesh kanagaraj) పై ఉన్న నమ్మకంతో మేకర్స్ కూడా రెమ్యునరేషన్ విషయంలో ఆలోచించలేదని అంటున్నారు.మరికొన్ని రోజులు ఆగితే నాగ్ రెమ్యునరేషన్ విషయంలో అసలు నిజం బయటకి వచ్చే అవకాశం ఉంది.
ఇక కొన్ని రోజుల క్రితం కూలీ నుంచి నాగ్ లుక్ కూడా విడుదలైంది, సైమన్ అనే క్యారక్టర్ లో ఉన్న నాగ్ లుక్ ఓ రేంజ్ లో ఉంది.మరి ఏ క్యారక్టర్ లోకి అయినా అవలీలగా దూసుకుపోయే నాగ్ విలన్ గా అధ్బుతాలు సృష్టిస్తాడో చూడాలి. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ,మలయాళ వర్సటైల్ యాక్టర్ టామ్ చాకో, సత్యరాజ్, శృతి హాసన్ తర్వాత కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. రజనీ తోనే జైలర్ ని నిర్మించిన సన్ నెట్ వర్క్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తోంది.