జానీ మాస్టర్(jani master)ని బెంగుళూరు లో అరెస్ట్ చేసారనే న్యూస్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు అక్కడ్నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ లోని నార్సింగి పిఎస్ కి తీసుకురానున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య ఆయేషా (ayesha)సుమలత నార్సింగ్ పీఎస్ కి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మీడియాతో ఎక్కువగా మాట్లాడటానికి నిరాకరించిన ఆయేషా తనకి జానీ మాస్టర్ ని నార్సింగ్ పీఎస్ కి తీసుకొచ్చినట్టుగా ఒక ఫేక్ కాల్ వచ్చిందని, దాని గురించీ కనుక్కోవడానికే వచ్చానని చెప్పి ఇంకేం మాట్లాడకుండా వెళ్లిపోయింది. కాకపోతే ఇంకో న్యూస్ కూడా ప్రచారంలోకి వస్తుంది. అసలు జానీ మాస్టర్ ఆచూకీ పోలీసులకి అయేషానే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. ఇక బాధిత లేడీ డాన్సర్ తన ఫిర్యాదులో అయేషాని కూడా చేర్చిన విషయం అందరికి తెలిసిందే. జానీ మాస్టర్ అయేషా లకి ఒక కొడుకు ఒక కూతురు.