తోటి డాన్సర్ ని చురుకుగా వేధింపులకి గురి చేసాడనే కేసులో స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(jani master)పై హైదరాబాద్ లోని నార్సింగి పిఎస్ లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి పోలీసులు పోక్సో కేసు కూడా నమోదు చేశారు.ఈ విషయంపై పలువురు సినీ ప్రముఖులు బాధిత అమ్మాయికి మద్దతుగా నిలవడంతో పాటుగా జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడు ఈ విషయంపై రాజకీయ ప్రముఖులు కూడా రంగంలోకి దిగి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ లోని గోషా మహల్ అసెంబ్లీ సెగ్మెంట్ బిజెపీ ఎంఎల్ఏ రాజా సింగ్(raja singh)తాజాగా ఒక వీడియోని విడుదల చేసారు. అందులో ఆయన మాట్లాడుతు పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఒక దొంగ,హత్యలు చేసే వ్యక్తికి ఎలా అయితే ఇంటరాగేట్ చేస్తారో,జానీ మాస్టర్ ని కూడా ఇంటరాగేట్ చెయ్యాలి. అందులో ఎంత మంది అమ్మాయిలని మత మార్పిడి కోసం ఒత్తిడి చేసాడో బయటపెట్టి, ఆ వివరాలను ప్రజల ముందు ఉంచాలి.జానీ మాస్టర్ సినిమా ఇండస్ట్రీ కి ఒక మాయని మచ్చ తీసుకురావడానికి ప్రయత్నించాడు.ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉండవచ్చు. గతంలో కూడా కొంత మంది ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చే అమ్మాయిలని చాలా ఇబ్బంది పెట్టారు.
ఇండస్ట్రీ పెద్దలకి నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే జానీ లాంటి వాళ్ళని క్లీన్ చెయ్యడానికి మీరందరు సహకరించాలి. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో అడుగుపెట్టకుండా ఒక చట్టం కూడా తీసుకురండి. ఎందుకంటే ఈ రోజు చాలా మంది సినిమా హీరోలని, హీరోయిన్స్ ని చూసి ప్రభావితం అవుతున్నారని కాబట్టి జానీ మాస్టర్ లాంటి వాళ్ళని అసలు వదలకుడని చెప్పుకొచ్చాడు. ఇక జానీ మాస్టర్ ని బెంగుళూర్ లో పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలు వస్తున్నాయి.