గత కొద్ది నెలలుగా సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారిన వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆమె ప్రియురాలు దివ్వెల మాధురి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ తనకు అన్యాయం చేశార ఆమె భార్య కొద్దిరోజులపాటు ఆయన ఇంటి వద్ద దీక్ష కొనసాగించారు. ఈ కోరికనే ఆయనకు, ఆయన భార్యకు, పిల్లలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అంశంగా మారింది. ఆ వ్యవహారం సద్దుమణుగుతోందనుకుంటున్న తరుణంలో మరో వివాదం ఎమ్మెల్సీ శ్రీనివాస్, ఆయన ప్రియురాలు మాధురిని చుట్టుముట్టింది. నాలుగు రోజుల కిందట తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్న ఈ జంట.. ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. స్వామివారి దర్శనం అనంతరం దివ్య మాధురి మాడవీధుల్లో హల్చల్ చేశారు. మాడవీధిలో తిరుగుతూ, ఫోటోలు ఫోజులు ఇస్తూ రీల్స్ చేశారు. అక్కడే మీడియాతో కూడా మాట్లాడింది తమ వ్యక్తిగత వివరాలను. ఈ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. గుడిలో వ్యక్తిగత విషయాలు మాట్లాడడం, గుడి పవిత్రత దెబ్బతినేలా రీల్సు చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది భక్తులు టిటిడి ప్రకారం దృష్టికి తీసుకెళ్లడంతో వారిపై చర్యలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకునే టీటీడీ అధికారులు ఆయా అంశాలను పరిశీలించి గురువారం ఫిర్యాదు చేశారు. టీటీడీ ఏవీఎస్ఓ ఎం మనోహర్ ఫిర్యాదు మేరకు తిరుమలలోని వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
టీటీడీ రూల్స్‌ను అతిక్రమించి, సంస్కృతి సాంప్రదాయాలను ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా కేసు నమోదు అయినట్లు. అయితే ఈ వ్యవహారంపై దివ్వెల మాధురి స్పందించారు. తాము రియల్సు చేయలేదని చెబుతున్నారు. తాము తిరుగుతున్నప్పుడు కొందరు ఫోటోలు తీశారని. వాటితో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం ఎటువైపు టర్న్ తీసుకుంటుందో అన్న ఆసక్తి సర్వత్ర ఉంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ శ్రీనివాస్, దివ్వెల మాధురి కొద్దిరోజుల్లో పెళ్లి కూడా సిద్ధమవుతున్నారు. ఈ షెడ్యూల్ తాజాగా వీరిద్దరూ ఒక ఇంటర్వ్యూలో ఉన్నారు. తమది గత జన్మ ప్రేమ అని, ఆ జన్మలో విడిపోవడం వల్లే ఈ జన్మలో కలుస్తున్నామంటూ మాదిరి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. సహజీవనం చేస్తున్నామని చెప్పిన మాధురి.. న్యాయపరమైన చిక్కులు తొలగిపోయిన తర్వాత వివాహం చేసుకొని ఒక్కటి కాబోతున్నట్లు ప్రస్తుతానికి.
తడబడిన భారత్.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి, సెమీస్ ఆశలు కోల్పోయింది
భూమ్మీద అత్యంత అనారోగ్యకర ఆహార పదార్థాలు ఇవే..