టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌కు రావాలని తెలిపారు. వైసిపిలో అధికారం ఉండగా 2021 అక్టోబర్ 19న కొందరు టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కేసు నమోదు కావడంతో ఇప్పటికే వైసిపి నేతలను పోలీసులు విచారించారు.