- రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులకు నో ప్రొటోకాల్
- తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపు
ముద్ర, తెలంగాణ బ్యూరో :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. కొన్ని కిందట ఏపీ, తెలంగాణకు సంబంధించి పెద్దలు హైదరాబాద్ లో చర్చలు జరిపారు. కొన్ని విషయాల్లో క్లారిటీ రాగా, విషయాలు త్వరలో పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అయితే తిరుమల విషయంలో తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు చాలా సంతోషంగా లేరని ఉన్నారు. తిరుమలకు వెళ్లిన వారికి తగిన గౌరవం దక్కడం లేదని, ప్రొటోకాల్ లాంటివి పాటించడం లేదని తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చిన్నచూపు ఎందుకు అని ప్రశ్నించారు.
అసలేం జరిగిందంటే..
రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, తిరుమల ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే తిరుమలలో వారికి సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు భద్రాచలం, యాదాద్రి ఆలయానికి వచ్చినప్పుడు వారికి ప్రొటోకాల్ అమలవుతో ఉన్నారు. కానీ తెలంగాణ ఎమ్మెల్యేలపై తిరుమలలో ఎందుకు చిన్నచూపు అనిరుధ్ రెడ్డి, బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. తిరుమలలో బాధతో మాట్లాడుతున్నామంటూ తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు సిఫార్సు చేస్తే కనీసం గదులు కూడా ఇవ్వరా అని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు తనకు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లలాంటివని చెబుతారు, కానీ తిరుమలలో తెలంగాణ నేతల పరిస్థితి. టీడీపీ, వైసీపీ నేతలు తెలంగాణలో వ్యాపారాలు చేసుకోవచ్చా, ఏపీ ఎమ్మెల్యేలను రానివ్వకుండా మేం కూడా అడ్డుకోవాలా అన్నారు. తెలంగాణల్లో ఆలయ ఏపీ ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ లేకుండా ఉండాలన్నారు. దీని కోసం వచ్చే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం బల్మూరి వెంకట్, అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ప్రొటోకాల్, వారి సిఫార్సు లేఖలపై స్పందించాలని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు.