ఏపీని డ్రోన్ హబ్ గా మార్చే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం విజయవాడలో డ్రోన్ సమ్మిట్ ను మంగళవారం, బుధవారాల్లో నిర్వహిస్తోంది. డ్రోన్ రాజధానిగా అమరావతిని నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర డ్రోన్ కార్పొరేషన్ కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ మేరకు మంగళవారం, బుధవారాల్లో గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్ – 2024 పేరుతో జాతీయ స్థాయిలో మేథోమదనాన్ని చేపడుతోంది. 2029 నాటికి రూ.1,000 కోట్ల పెట్టుబడులు, రూ.6000 కోట్ల రాబడి రూ.12,500 మందికి డ్రోన్ యాజమాన్య నిర్వహణలో ఉద్యోగాలు కల్పన లక్ష్యంగా పాలసీ రూపొందించేందుకు, డ్రోన్ పంపిణీ ఆలోచనలను పంచుకుంది. ఈ సమ్మిట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన, కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో డ్రోన్ యాజమాన్య నిర్వహణపై కార్యాచరణ ప్రణాళికలను ఆవిష్కరించనుంది. నూతన ఆవిష్కరణలతో డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా అమరావతిని మళ్లీ ప్రత్యేక తీర్మానం చేయనున్నారు.
ఈ సదస్సులో డ్రోన్ తయారీలో అత్యాధునిక, సాంకేతిక, విప్లవాత్మకమైన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీతో కూడిన సేవలతోపాటు వ్యవసాయం, పట్టణ ప్రణాళిక, విపత్తుల నిర్వహణ, రవాణా, ఆరోగ్యం, పరిశోధన, అభివృద్ధి, ప్రాథమిక రంగాల్లో డ్రోన్ల వినియోగంపై కొత్త ఆవిష్కరణలకు సంబంధించి సమీక్షించనున్నారు. జాతియ, అంతర్జాతీయ స్థాయిని డ్రోన్ నిపుణులు 400 మంది ఈ సదస్సులో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ పాలసీ-2024 తీసుకురావడానికి అవసరమైన సలహాలు సూచనలు నిపుణుల నుంచి స్వీకరించనున్నారు. 45 మందికిపైగా ఎగ్జిబిటర్లు సదస్సులో భాగస్వాములు కానన్నారు. వివిధ రంగాలు, విభాగాలు వినియోగించేందుకు అనువైన డ్రోన్లను ప్రదర్శించారు. డ్రోన్లు వినియోగం ద్వారా పంటలపై నిరంతర పర్యవేక్షణ మందులు చల్లడం, మందులు వేయడం వంటి మందులకు డ్రోన్లు అందుబాటులో ఉంచబడతాయి. ఈ సదస్సు వేదికగా జాతీయ డ్రోన్ రాజధానిగా అమరావతిని నిలిపేందుకు సదస్సులో విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నారు. కొత్త ఇన్నోవేషన్ – ఎకనామిక్ గ్రోత్, కెపాసిటీ బిల్డింగ్, గ్లోబల్ ప్రాజెక్ట్ ఇండస్ట్ పార్ట్నర్షిప్ అనే మూడు వస్తువులను అమలు చేయనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు, సాంకేతిక సంస్థలతో డ్రోన్ కార్పొరేషన్ భాగస్వామ్యం. వర్సిటీల్లో ఏఐ డ్రోన్ కోర్సులను నిర్వహించనున్నారు. ఏపీ డ్రోన్ జాతీయ స్థాయిలో ఒక మోడల్‌గా నిలిచేలా కార్యాచరణ అమలు చేయనుంది.
డ్రోన్ సదస్సులో 33 కంపెనీలు, 43 కేంద్ర ప్రభుత్వ శాఖలో పాల్గొంటున్నాయి. విదేశీ ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. ఈ సదస్సు ద్వారా దేశీయ డ్రోన్ తయారీ రంగంలోని సంస్థలను ఒకే చోటకు చేరుస్తారు. యువత ఉపాధి అవకాశాలు పెంచుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను ప్రవేశపెట్టారు. వీటిలో ఏఐ డ్రోన్ సిలబస్ చేర్చనున్నారు. అమరావతికీ డ్రోన్ సిటీగా గుర్తింపు తెచ్చేలా అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయి. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు పన్ను రాయితీ, సబ్సిడీ ప్రోత్సాహకాలను అందించబడుతుంది. రెండు రోజులు సదస్సులో భాగంగా మంగళవారం సాయంత్రం కృష్ణానది తీరాన పున్నమి ఘాటు వద్ద 5500 డ్రోన్లతో జాతీయస్థాయి హాకథాన్ నిర్వహించారు. నిలిచిన డ్రోన్ నిర్వాహకుడికి బహుమతిగా రూ.24 లక్షలు డ్రోన్ కార్పొరేషన్ స్థానంలో నిలిచింది. బుధవారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ సమ్మిట్‌లో భాగంగా ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రెండు ఎంవోయూలు కుదుర్చుకోనుంది. డ్రోన్ పైలెట్ శిక్షణపై క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంటుంది. తిరుపతి ఐఐటిని నాలెడ్జ్ పార్టనర్ గా చేర్చుకుంటూ మరో ఒప్పందం ఉంటుంది. నవంబరు చివరి వారం నాటికి డ్రోన్ పాలసీకి ఇస్తామని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ కార్యదర్శి తెలిపారు.
ఏపీలో మరో కీలక పథకం అమలు.. దీపావళి పండగకు లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్
భూమ్మీద అత్యంత అనారోగ్యకర ఆహార పదార్థాలు ఇవే..