తమిళ్ స్టార్ హీరో సూర్య, శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘కంగువా’. ట్రావెల్ యాక్షన్ డ్రామా ఫ్యాన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్‌కి సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాని అత్యధిక భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. యు.వి.క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకాలపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఒక డిఫరెంట్ జోనర్‌లో, డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించబడిన ఈ సినిమా ప్రేక్షకులు, సూర్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే మేకర్స్ ప్రకటించినట్టుగా నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అడ్డుకుంటోంది.
వివరాల్లోకి వెళితే.. ‘కంగువా’ చిత్రం విడుదల నిలిపివేయాలని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. స్టూడియో గ్రీన్ సంస్థ తమకు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వలేదని, ఆ డబ్బు ఇచ్చిన తర్వాత సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమాల నిర్మాణం కోసం రిలయన్స్ సంస్థ నుంచి రూ.99 కోట్లకు పైగా స్టూడియో గ్రీన్ సంస్థ రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఇప్పటివరకు రూ.45 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించారు. వారికి చెల్లించాల్సిన మిగిలిన డబ్బు ఇచ్చిన తర్వాతే కంగువా విడుదల చేసుకోవాలని రిలయన్స్ సంస్థ ఫిర్యాదు చేసింది. తంగలాన్ కూడా ఓటీలో స్ట్రీమ్ చేయకూడదని కోరింది. ఈ కేసు జస్టిస్ కుమారేష్ బాబు ముందుకు విచారణకు వచ్చింది. తమకు నవంబర్ 7 వరకు సమయం కావాలని స్టూడియో గ్రీన్ సంస్థ కోర్టును కోరింది. అప్పటివరకు తమ సినిమా రిలీజ్ చేశాం అని చెప్పింది. అంతేకాదు, తంగలాన్ కూడా అప్పటివరకు ఓటీటీలోకి తీసుకురాబోమని. ఈ కేసును నవంబర్ 7వ తేదీకి వాయిదా వేశారు. రిలయన్స్, స్టూడియో గ్రీన్, మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు పూర్తయితే తప్ప కంగువా రిలీజ్ అవ్వదు. మేకర్స్ ప్రకటించిన రిలీజ్ డేట్‌కి ఇంకా చాలా రోజులు ఉంది. మరి ఈలోపు సమస్య పరిష్కారమైతే సినిమా సజావుగా రిలీజ్ అవుతుంది. లేదంటే కంగువాకు కష్టాలు తప్పవు.