మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. గడిచిన కొన్నాళ్లుగా మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య వివాదం నడుస్తోంది. మంచు మనోజ్ కుటుంబానికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఈ విధంగానే కుటుంబంలో వీరి గొడవ చోటుచేసుకున్నట్లు ఉన్నాయి. మంచు మనోజ్, తండ్రి మోహన్ బాబు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ప్రముఖ మీడియా ఛానల్స్ కూడా కథనాలను ప్రచురించాయి. ఆస్తులు పంపకాల విషయంలో మొదలైన గొడవ దాడి వరకు వెళ్లినట్లు చెబుతున్నారు. మంచు కుటుంబానికి విద్యాసంస్థలు ఉన్నాయి. ఆస్తులు, స్కూలు వ్యవహారంలో మంచి మనోజ్ తండ్రిని ఎదురిస్తున్నాడని ప్రచారం. తారాస్థాయికి చేరుకోవడంతో ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఘర్షణ తర్వాత మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు తనపై దాడి చేశారు అంటూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మంచు మనోజ్ గాయాలతో వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భార్యపై కూడా దాడి చేసినట్లు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
మోహన్ బాబు ఇంట్లో గొడవ జరిగిన తరువాత 100 కి ఫోన్ చేసి మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాలతో పాటు ప్రముఖ వీడియో సంస్థల్లో జరుగుతున్న ఈ ప్రచారంపై మంచు ఫ్యామిలీ పి.ఆర్ స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని మంచి ఫ్యామిలీ పిఆర్ టీం స్పందించింది. తండ్రి కొడుకులు ఇద్దరూ దాడి చేసుకున్నారని వార్తల్లో నిజం లేదని చెబుతున్నారు. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నాయి మంచు కుటుంబం పిఆర్ టీం. పి ఆర్ టీం ఎటువంటి గొడవలు జరగలేదని చెబుతున్నప్పటికీ మనోజ్ మాత్రం గొడవలు, సెక్యూరిటీ సిబ్బంది తనపై దాడికి పాల్పడినట్లు చెబుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదేలా ఉంటే గతంలో కూడా మంచు మనోజ్, ఆయన సోదరుడు విష్ణుమధ్య గొడవ జరిగింది. అప్పట్లో కూడా మనోజ్ పై విష్ణు గాడికి ప్రచారం జరిగింది. ఎవరు బయటకు చెప్పనప్పటికీ గొడవ జరిగిన విషయం మాత్రం నిజమేనని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా జరిగిన గొడవకు సంబంధించి బయటకు వచ్చి ఎవరైనా స్పందిస్తే గాని అసలు విషయం తెలియదని కొలవరి చెబుతున్నారు. ఏది ఏమైనా మంచు కుటుంబంలో ఆస్తి వివాదాలను రాజేసినట్లు చెబుతున్నారు.
సీఎం చంద్రబాబుకు అన్ని కులాల మద్దతు.. కులాన్ని ఆపాదించిన విజయసాయిపై బుద్ధి ఫిర్యాదు
జుట్టు పెరగడానికి చిట్కాలు | జుట్టుకు ఈ ఫుడ్స్ మీ ఆహారంలో పెరగనివ్వండి