మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక లేడీ ఆర్టిస్ట్ నిహారిక. 2016లో నాగశౌర్య హీరోగా వచ్చిన ‘ఒక మనసు’ చిత్రంలో హీరోయిన్గా నటించింది. అయితే ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అలాగే ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 2019లో పెదనాన్న చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో భాగ్యం అనే క్యారెక్టర్లో నటించింది. ఆ సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి 2020లో చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. అయితే వారి వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 2023లో ఇద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. పెళ్లి తర్వాత కూడా కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించింది. కానీ, సినిమాల జోలికి వెళ్ళలేదు. 2024లో ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ పెద్ద విజయాన్ని అందుకోవడంతో వార్తల్లోకి ఎక్కింది. అంతా కొత్తవారితో నిహారిక చేసిన ఎక్స్పెరిమెంట్ని అందరూ అభినందించారు.
తాజాగా మరోసారి వార్తల్లో నిలుస్తోంది నిహారిక. తెలుగు సినిమాల్లో తనకి తమిళ లక్ లేదని భావించిన ఆమె సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే అక్కడ రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి ‘మద్రాస్ కారన్’. షేన్ నిగమ్ హీరోగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నిహారిక హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకి సంబంధించిన ఒక రొమాంటిక్ సాంగ్ ఇటీవల విడుదలైంది. అయితే ఈ సాంగ్‌ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇప్పటివరకు నిహారిక చేసిన ఏ సినిమాలోనూ రొమాంటిక్ సీన్స్‌లోగానీ, ఇంటెన్స్ సీన్స్‌లోగానీ కనిపించలేదు. కానీ, ఈ పాటలో షేన్ నిగమ్‌తో కలిసి రకరకాల భంగిమల్లో విన్యాసాలు చేసింది.
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ మూవీ ‘సఖి’ ఓ పాటను ‘మద్రాస్ కారన్’ కోసం రీమిక్స్ చేశారు. ఒక బ్యూటిఫుల్ హౌస్‌లో మంచి రొమాంటిక్ వాతావరణంలో ఈ పాటను షూట్ చేశారు. నిహారిక అంత బోల్డ్‌గా నటించడం అదే మొదటిసారి. ఇది ఎవరూ ఊహించని పరిణామం కాబట్టి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఆ విన్యాసాల షాట్లను షేర్ చేస్తూ నెటిజన్లు నిహారికను ట్రోల్ చేస్తున్నారు. కమిటీ కుర్రోళ్ళు చిత్రంతో నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న నిహారిక ఇలాంటి పాటల్లో అందాలు ఒలకబోయడాన్ని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఎంతో గౌరవప్రదమైన మెగా ఫ్యామిలీ నుంచి ఇచ్చిన నిహారిక ఇలా కమర్షియల్ హీరోయిన్గా అన్నింటికి సిద్ధం అన్నట్టుగా స్క్రీన్‌మీద కనిపించడం ట్రోలింగ్కి కారణంగా మారింది. అన్నీ పక్కన పెడితే.. మద్రాస్ కారాన్ని ఒక సినిమా తీసుకొని అందులో నటించిన షేన్ నిగమ్, నిహారికలను ఆర్టిస్టులుగా పరిగణిస్తూ చూస్తే ఇద్దరూ ఆ పాటలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారని చెప్పక తప్పదు. ఒక విధంగా.. ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా అలాంటి స్టెప్స్, ఫీట్స్ చేసి ఉండదని నిస్సందేహంగా చెప్పొచ్చు. సోషల్ మీడియాలో నిహారిక గురించి ట్రోలింగ్ కంటే ఆమె పెర్ఫార్మెన్స్కి కాంప్లిమెంట్సే ఎక్కువ రావడం విశేషమనే చెప్పాలి.