ముద్రణ ప్రతినిధి : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయు) కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ గాండ్ల సంపత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీయూడబ్ల్యూజే ఎన్నికలలో భాగంగా జిల్లా వైస్ ప్రెసిడెంట్ కోసం కేవలం ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో సంపత్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఎన్నికల బాధ్యులు తనపై గౌరవం ఉంచి , ఏకగ్రీవం కోసం అందించిన సహాయ సహకారాలకు , అండగా నిలిచిన తోటి జర్నలిస్టులందరికీ సంపత్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. టీయూడబ్ల్యూజే జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సంపత్ ను పలువురు జర్నలిస్టులతో పాటు, మిత్రులు అభినందించారు. వైస్ ప్రెసిడెంట్ గా తన సారథ్యంలో జర్నలిస్టు సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని సంపత్ తెలిపారు.