మంచు మనోజ్(manoj)మోహన్ బాబు(mohan babu)మధ్య రెండు రోజులుగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ విషయంలో పోలీసులు కూడా జోక్యం చేసుకోవడంతో ఏ నిమిషం ఏం జరుగుతుందనే ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది. రీసెంట్ గా ఈ విషయం మీద విష్ణు(vishnu)కూడా మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు తన తండ్రి మోహన్ బాబు తో పాటు తల్లి కూడా హాస్పిటల్ లో ఉందని చెప్పాడు. మోహన్ బాబు కూడా నిన్న రిలీజ్ చేసిన ఆడియోలో తన భార్య హాస్పిటల్ లో ఉందని చెప్పడం జరిగింది.
కానీ ఇప్పుడు మనోజ్ మాట్లాడుతున్నారు నా తల్లి హాస్పిటల్ లో ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.కూర్చుని మాట్లాడటానికి నేను సిద్ధమని చెప్పడం జరిగింది.అదే టైం లో రాచకొండ సీపీకి లక్ష రూపాయిల బ్యాండ్ సమర్పించిన మనోజ్ తనంతట తాను గొడవలకు దిగానని..శాంతి భద్రతకు విఘాతం కలగలేదని బాండ్ లో జరిగింది.ఇక ఈ ఈ కేసులో మోహన్ బాబు, విష్ణు లెంట్ రివాల్వర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.