సంక్రాంతి పండుగ అంటే చాలు ఉభయగోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోడి పందాలు ఉంటాయి. ఈ కోడి పందాలు వీక్షించేందుకు, ఆడేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిమంది వస్తుంటారు. ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఉభయగోదావరి అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహించేందుకు నిర్వాహకులు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కోడి పందాలు సోమవారం నుంచి ఉభయగోదావరి ఏర్పాటు పలు ప్రాంతాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఒకవైపు పోలీసు దాడులు కొనసాగుతున్నప్పటికీ మరోవైపు పందెం నిర్వహకులు మాత్రం ఏర్పాట్లను మమరం చేస్తున్నారు. వేల సంఖ్యలో తరలివచ్చే జనం కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీ ఎత్తున షామియానాలు, టెంట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు, పార్కింగ్ సౌకర్యాలతో కోడిపందాల నిర్వహణకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. కొన్నిచోట్ల కోడిపందాలతోపాటు గుండాట, పేకాట నిర్వహణకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 150కిపైగా ప్రాంతాల్లో పందెం బరుల్లో పుంజులు కొట్లాటలకు సిద్ధమవుతున్నాయి.
అలాగే తూర్పుగోదావరి జిల్లాలోనూ అనేక ప్రాంతాల్లో ఈ పోటీల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని వీక్షించడానికి లక్షల్లో ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కూడా భారీగా బరులు సిద్ధం చేస్తున్నారు. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఫ్లడ్లైట్ల వెలుగులో పందేలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, వేమూరు, చెరుకుపల్లి, పిట్టలవానిపాలెం, నగరం, చీరాల, వేటపాలెం మండలాల్లో ఇప్పటికే ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. పిట్టలవానిపాలెం వారి ఒక బరిలో పందెంకోడిని దింపడానికి ముందుగా నిర్వాహకులు వద్ద పేరు నమోదు చేసుకోవాలని చెబుతున్నారు. ఇక్కడ ఒక్కో పందెం 5 లక్షల నుంచి 15 లక్షలు వరకు ఉంటుందని తెలుస్తోంది. వరుసుగా మూడు పందాల్లో పుంజు నెగ్గితే యజమానికి ద్విచక్ర వాహనాన్ని బహుమతిగా ఇవ్వనున్నారు. కోడిపందాలు సోమవారం ఉదయం నుంచి ఆయా ప్రాంతాలలో మొదలుకొని ఎంతోమంది పందెం రాయళ్ళు ఇప్పటికే పోటీల నిర్వహణకు సిద్ధంగా ఉన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వేలాది రూపాయలు వెచ్చించి పెద్ద ఎత్తున కోడి పుంజులను సిద్ధం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు, వ్యాపారులు వీటిని వీక్షించేందుకు, పందాలు కాసేందుకు సిద్ధమవుతున్నారు.
మహా కుంభమేళాకు వేళాయె.. రేపటి నుంచి అతిపెద్ద హిందూ పండగ
జుట్టు ఒత్తుగా, పొడవు పెరగాలంటే 8 యోగాసనాలు చేయండి చాలు