ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తోంది. పాలన సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న దశలో ప్రస్తుతం కూటమిలోని పార్టీలైన టిడిపి, జనసేన నేతల చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఆయన ఏ సభలో పాల్గొన్న అభిమానులు సీఎం.. సీఎం అన్న నినాదాలు చేస్తూ ఉంటారు. అయితే, గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా బరిలోకి దిగే విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన పార్టీ కూటమిలు.. సీఎంగా చంద్రబాబు నాయుడును ఎన్నుకోగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ను నియమించారు. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న దశలో పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం, సీఎం పదవి చుట్టూ ఏపీలో సరికొత్త రాజకీయం మొదలైంది. ఒకవైపు టిడిపి నేతలు, మరల జనసేన నాయకులు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలతో రాజకీయాలను కట్టుతున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవిని ఎవరైనా టిడిపి నేతలు కోరడం కొత్త చర్చకు దారి తీసింది. మరోవైపు జనసేనకు చెందిన నేతలు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్నాళ్లయిన ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్ ఈ అంశంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తమలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు చంద్రబాబుతో నలుగురు కలిసి దృష్టి సారిస్తామని. లోకేష్ ను డిప్యూటీ సీఎం పదవిలో చూడాలని క్యాడర్ కోరుకోవడంలో తప్పు టిడిపి లేదని.. అదే సమయంలో తామ పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని పదేళ్లుగా నిరూపించామని. పవన్ కళ్యాణ్ ను సీఎం బడుగు బలహీన వర్గాల వారు కోరుకుంటున్నారని అన్నారు.
సీఎం, డిప్యూటీ సీఎం పదవుల విషయంలో ఎన్నికల ముందు అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ఎన్నికలకు వెళ్లారో.. అదే కొనసాగిస్తే మంచిదని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. అనవసరంగా వైసీపీ నేతల మాటలకు ఊపిరి పోయవద్దని సూచించారు. వైసీపీకి చెందిన కొంతమంది నేతల జేబులో మైకులు వేసుకుని తిరుగుతున్నారని, వాళ్లకు అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. పేర్ని నాని, రోజా జేబుల్లో మైకులు వేసుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం రెండు రోజులుగా డ్రోన్ కెమెరాలు తిరగడంపై కిరణ్ రాయల్ స్పందించారు. డ్రోన్ కెమెరాలపై ఐదుగురు అధికారులతో పర్యవేక్షణ కమిటీ వేశారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ దేశానికి కావాల్సిన నాయకుడు అని అభివర్ణించారు.
ఇదిలా ఉంటే మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ ఆ పార్టీ నాయకులనుంచి గట్టిగా వినిపిస్తోంది. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇప్పటికే వర్మ డిమాండ్ చేశారు. అంతా దైవేచ్చ అని, లోకేష్ కు ఉందేమో చూడండి అని. నుదుటి మీద రాసి పెట్టింది ఎవరో తీయలేరని స్పష్టం చేశారు. టిడిపిలోని కీలక నేతలు కూడా నారా లోకేష్ ను సీఎం చేయాలంటూ గళం ఎత్తుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కడప పర్యటన నేపథ్యంలో జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. యువతకు, తెలుగుదేశం పార్టీకి భరోసా ఇవ్వాలంటే లోకేష్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయబోతున్న అధినేత చంద్రబాబును శ్రీనివాస్ రెడ్డి. ఆయన వ్యాఖ్యలు చేసిన వెంటనే మరి కొందరు నాయకులు అదే విధంగా మాట్లాడుతున్నారు. టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ సోమిరెడ్డి స్వీట్ కూడా చేశారు. పార్టీలో మూడోతరం నాయకులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో టిడిపి నేతలు.. అది నేత చంద్రబాబుకు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ రిక్వెస్ట్ లు చేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కు రెండేళ్లు సీఎంగా అవకాశం ఇవ్వాలంటూ జనసేన డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇది పార్టీలడర్ మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా పెద్ద ఎత్తున వాగ్వాదం. మరి ఈ వ్యవహారం ఎటువైపు వెళుతుందో చూడాల్సి ఉంది.
వైద్య విద్యార్థిని హత్యాచారం ఘటనలో నిందితుడికి శిక్ష ఖరారు.. జీవిత ఖైదు విధించిన కోర్టు
ఆరోగ్యకరమైన పళ్ల కోసం ఈ ఆహార పదార్థాలు ట్రై చేయండి..